S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జాతిఫిత

శా. జాతీయోద్యమ శాంతి భాస్కరుడు, వివ్వస్తవ్య మేథావి, సం
పూతాంతర్యుతు డాంగల పాలక జన వ్యూహాల భేదించెడున్
నీతిన్నిత్యము బోధజేయు మతి సందీపించు సన్మూర్తి, మా
నేతంచున్ నుతియింపగా మెలగు గాంధీ బాపుజీ జాతికిన్

శా. జంకున్ గొంకును లేని ధీరవరుడై జాతీయ వాదంబు న
ల్వంకల్ ధాత్రిని మెచ్చురీతి నడుపున్ లక్ష్యంబుతో మెల్గి తా
బొంకన్ మాటయె వీనులంబడని సంపూతాంతరంగుండునై
క్రుంగన్ హూణుల పాలనంబు సరసోగ్రుండౌ గదా గాంధిజీ

ఉ. నెత్తురు బొట్టు నేలపడనీకయె ఆంగ్ల జనాధినేతలన్
చిత్తములందు భీతిగొనజేయు పథంబున నుద్యమించి సం
పత్తన శాంత్యహింసల స్వభారత భూతలమందుజల్లి, లో
కోత్తర రాజనీతి మనునుత్తము డుర్విని గాంధితాతయే!

శా. అంధీభూత హృదంతరాంతర భయవ్యాలోల చిత్తంబులన్
సింధుప్రాంత నివాసులాంగ్ల జన దుశే్చష్టాళిచే గొంకుచో
సంధానంబు ఘటించి భారత జన స్వాత్మాభిమానంబునన్
గాంధీ స్వేచ్ఛను పొంద పోరభువియే గ్రామంబుగా గ్రాలెగా!

స. బానిసత్వముతోడ బాధాగ్నిలోదైళ్లు
భారతావని బాధ బాపదలచి,
శాంత్యహింసాగ్నులన్ సత్యాయుధముతోడ
జతకూర్చి ఉద్యమాకృతిని దీర్చి,
ఏకసూత్రత గూర్చి ఎల్లజనానీక
మొక్కబాటను సాగచక్కదిద్ది,
ఇనుడస్తమించని ఘన పాలకుల మాన
సమ్ముల భీతియు జంకుఁగొల్పి,

గీ. భారతాంబ సంకెళ్లనే పగులగొట్టి
స్వేచ్ఛఁవాయువుల్ పీల్చగా శ్రేయమిడిన
గాంధి వంశాబ్ధి సంజాత కైరవ హితు
దాతడే జాతిపిత దేవుడాతడిలకు.

సీ. ఒక చెంపపై గొట్ట నిక నుండె నొక చెంప
యని చూపజాలిన యనఘుడతడు,
అనువు గానిది మాన్ప తన వౌన ముద్రను
పొలుపుగా సాధించు పూజ్యుడతడు,
విఘ్నపాళినెదిర్చి విశ్వమే వినుతించు
శాంతి సందేష్ట సాధవతడు,
బోసినవ్వుల రువ్వి మోహనంబుగ జాతి
అంతరంగముగెల్చు నాఢ్యుడతడు,

గీ. ఆతడే గాంధి వంశాబ్ధి హ్లాదకరుడు
ఆతడే నవయుగ పూరుషాధికుడు
ఆతడే సర్వధాత్రీతలార్ఘ్యయశుడు
భారతాంబ నిద్దరపు కీర్తి కారకుండు.

ఉత్సాహం: నూలు వడకు రాట్నమట్లు నూతనోద్యమోర్విలో
వేలవేల జనుల నొక్క వీధి నడపి నేర్పునన్
వ్రేలు తెల్లవారినెల్ల భీతి వరద పాల్పడన్
చాల నేర్చుజూపి గాంధి జాతిపితగ పొల్చెగా!

కం. మోహనదాసను పేరున
మోహితులను జేసి జనుల పోరుంబాటన్
వాహిని వలె నడిపించిన
మాహాత్ముడు జాతికి పిత మన గాంధీజీ.

-రాయప్రోలు సీతారామశర్మ 97017 64878