S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నందనం

కొమ్మ కొమ్మలా గుబురు రెమ్మలా
స్వర కోయిల కూయలా.. ఇలా.. ఇలా..
కులుకులమ్మ కోయిలమ్మ
ఊరకనే ఊచలా
సరాగాల ఊయల.. చిరుగాలుల
చిగురాశల...
కలువ కన్నుల కనుల వెనె్నల-
చిరుగాలులింతేరా చిరాకులెందుకురా
పచ్చబొట్టు తెంచుకురా
ఆవలొడ్డు ఎంచుకురా
సరిగమల కలకల గలగల
మిలమిలలా జలజల
కనులింతలా.. తనువంత పులకింతలా...
ఓతూరి గోదారి మురిపెంగ దరిసేరి
పడవోడ పల్లోడ వలపున్న పిల్లోడ
ముద్దులా నీ ఎంకి అద్దరిని వున్నాది
పొద్దుగుంకక ముందే పోయి రమ్మన్నాది
ఎంకాడ.. నీ నీడ.. బింకమ్ము నడుమాడ...
ముసిముసిగ నసిగేసి వడివడిగ అడుగేసి
ఎంకి పొంకమ్ముపై నా నీడ నడయాడ
మలితూరి గోదారి ఇద్దర్నీ కలిపింది
వలపు నావ వడివడిగా సాగింది
అద్దరికై
మా ఇద్దరి ఒద్దికకై

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505