S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రకృతి పెంచిన శక్తులు

చలికి అందరూ వణుకుతుంటే.. కొందరు మాత్రం పలుచటి టీషర్టులు వేసుకుని హాయిగా తిరిగేస్తుంటారు. 12 గంటలు నిద్రపోయాక కూడా కొందరికి బద్ధకం తీరదు.. కొందరు మాత్రం కేవలం ఐదు గంటల నిద్రతో ఉత్సాహంగా బతికేస్తుంటారు. ఇలాంటి లక్షణాలను అందరూ కోరుకున్నా కొద్దిమందికి మాత్రమే ఈ ప్రత్యేకతలుంటాయి. జన్యుపరమైన కారణాల వల్ల కొందరికి ఈ లక్షణాలు సంక్రమిస్తే.. మరికొందరికి తమ పరిసరాలకు అలవాటు పడటం ద్వారా ఆ సామర్థ్యాన్ని సాధించుకుంటారు. అలా ప్రపంచంలో అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యమైన ఐదు ప్రత్యేకతలివి.

మాకెన్ జాతి పిల్లలు

చాలామంది నీళ్లలోకి వెళ్లగానే కళ్లు సరిగా కనిపించవు. అన్నీ మసగ్గానే కనిపిస్తాయి. కానీ మాకెన్ జాతి పిల్లలకు మాత్రం ఆ సమస్య లేదు. వాళ్లు నీటిలోపల కూడా నేలపై చూసినట్లే స్పష్టంగా చూడగలరు. మయన్మార్, థాయిలాండ్‌లోని అండమాన్ తీర ప్రాంతంలో నివసించే మూడు తెగల కలయికతో ఏర్పడిన సమూహమే ఈ మాకెన్ జాతి. సాధారణంగా వీరిని నీటి మనుషులుగానే పిలుస్తారు. వాళ్లు తమ జీవితంలో ఎక్కువ భాగం సముద్రం ఒడ్డున గుడిసెల్లో, సముద్రంపై పడవల్లో గడిపేస్తారు. అందుకే వాళ్ల కళ్లు నీటిలో కూడా స్పష్టంగా చూడటానికి అలవాటు పడిపోయాయి. శాస్ర్తియంగా ఈ విషయాన్ని నిరూపించారు శాస్తవ్రేత్తలు. 2003లో కరెంట్ బయాలజీ మేగజైన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం తిమింగలాల మాదిరిగా మాకెన్ తెగ పిల్లలకు కూడా నీటిలో స్పష్టంగా చూడగలిగే శక్తి ఉందనీ.. ఒడ్డున ఉంటూ చేపలు పట్టే మాకెన్ తెగ వాళ్లలో ఈ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుందని, నిత్యం పడవలపై ప్రయాణించేవాళ్లలోనే ఈ లక్షణం ఎక్కువగా ఉంటుందని తేలింది.

బలమైన ఎముకలు

వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గిపోతుంటుంది. కొందరిలో ఇది మరింత వేగంగా తగ్గుతుంది. ఫలితంగా ఆస్టియోపోరోసిస్‌తో పాటు ఫ్రాక్చర్ల బారిన పడతారు. కొందరిలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక స్థితి కనిపిస్తుంది. దానిపేరు స్క్లెరాస్టియాసిస్. ఈ సమస్య ఉన్నావాళ్లలో జీవితాంతం ఎముకల సాంద్రత పెరుగుతూనే ఉంటుంది. ఎస్‌ఓఎస్‌టీ జన్యువు కారణంగా స్క్లెరాస్టిక్ అనే ప్రొటీన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఉత్పత్తి అయితే స్క్లెరాస్టియాసిస్‌కు దారితీస్తుంది. ఈ సమస్య ఉన్నవారిని అధ్యయనం చేయడం ద్వారా ఆస్టియోపోరోసిస్‌కు పరిష్కారం కనుగొనేందుకు శాస్తవ్రేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఎముకల సాంద్రత అలా పెరుగుతూనే ఉంటే అది భారీకాయానికి, చెముడుకు దారితీయచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎముకలు సాధారణ స్థాయి కంటే ఎక్కువ గట్టిగా, మరింత బలంగా ఉంటాయి. ఆఫ్రికేనర్ జాతి ప్రజల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది.

నిద్ర తక్కువ
చాలామందికి ఓ గంట నిద్ర తక్కువైనా ఆ రోజంతా కునుకుపాట్లు పడుతూనే ఉంటారు. కానీ కొందరు రోజుకు ఐదు గంటలు నిద్రపోయినా చాలు.. ఉత్సాహంగా పనులు చేసుకుంటూ గడిపేస్తారు. జన్యువుల్లో మార్పు కారణంగానే ఈ లక్షణం సంభవించే అవకాశం ఉందని అమెరికన్ అకాడమీ స్లీప్ మెడిసెన్ గుర్తించింది. డీ ఈసీ2 అనే పరివర్తన చెందిన జన్యువు ఉన్న వాళ్లకు నిద్ర తక్కువైనా దాన్ని తట్టుకునే సామర్థ్యం ఉంటుందట. మామూలు వాళ్లు రోజుకు కేవలం ఐదు గంటలు మాత్రమే పడుకుంటే వారు అనారోగ్య బారిన పడతారు. అయితే.. ఈ జన్యువు అందరిలోనూ కనిపించదు. తాము ఆరు గంటల కంటే తక్కువసేపు మాత్రమే నిద్రపోతామని చెప్పేవాళ్లలో కేవలం ఒక్క శాతం మందిలో మాత్రమే ఈ జన్యువు కనిపించే అవకాశా లున్నాయి. మిగతావారిలో అప్పటికప్పుడు ఎటువంటి సమస్యలు కనిపించక పోయినా దీర్ఘకాలంలో ఇది అనారోగ్యానికి దారితీస్తుంది.

గడ్డకట్టే చలిలో కూడా..

మనిషి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 36.5 డిగ్రీల నుంచి 37.5 డిగ్రీల మధ్య ఉంటుంది. అందుకే మనుషులు చలి కంటే వెచ్చటి వాతావరణానికే సులువుగా అలవాటు పడతారు. కానీ సాధారణ మనుషులకు భిన్నంగా ఆర్కిటిక్ పరిధిలో నివసించే 3ఇన్యూట్స్2. ఉత్తర రష్యాలో ఉండే నెనెట్స్ మాత్రం గడ్డకట్టే చలిలో జీవించడానికి అలవాటు పడిపోయారు. వాళ్ల శరీర నిర్మాణం ఇతరులకంటే చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే చలికి వాళ్ల శరీరం స్పందించే తీరు కూడా భిన్నంగా ఉంటుంది. వాళ్ల చర్మం ఇతరులకంటే వేడిగా ఉంటుంది. వారి జీవక్రియల వేగం కూడా ఎక్కువ. వారి శరీరంలో స్వేదగ్రంథులు తక్కువగా ఉంటాయి. చలికి వాళ్లు వణకరు. ఇన్యూట్స్, నేనట్ ప్రజలకు ఇవి పూర్తిగా జన్యుపరంగా సంక్రమించిన లక్షణాలు. బయటివాళ్లు అక్కడికి వెళ్లి ఎనే్నళ్లు జీవించినా వారికి ఆ సామర్థ్యం వారికి రాదు.

ఎత్తుల్లో జీవనం

బాగా ఎతె్తైన ప్రదేశాల్లో ప్రాణవాయువు తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో కాసేపు గడపటమే కష్టం. అలాంటిది ఆండియన్ జాతి ప్రజలు సముద్ర మట్టానికి ఆరు వేల అడుగుల ఎత్తులో హాయిగా జీవించగలరు. సముద్ర మట్టం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతుంటుంది. దానివల్ల తలనొప్పి, రక్తపోటు పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. కానీ ఆండియన్ జాతి ప్రజలకు మాత్రం ఇలాంటి ఇబ్బందులు ఉండవు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే కొన్ని తెగల ప్రజలు సహజంగానే ఆ పరిస్థితులకు అలవాటు పడిపోయారు. ఫలితంగా ఇతరుల కంటే వారి ఊపిరితిత్తుల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వాళ్లు శ్వాస తీసుకున్న ప్రతీసారి ఎక్కువ ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. ఆక్సిజన్ తక్కువగా అందితే సాధారణ వ్యక్తుల్లో ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. కానీ ఈ ఆండియన్ ప్రజల్లో మాత్రం వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది. వేల ఏళ్లుగా వాళ్లలో పెరుగుతూ వచ్చిన లక్షణాలివి. అందుకే వాళ్లు పర్వతాల నుంచి దూరంగా వచ్చి బతుకుతున్నా కూడా వారిలో ఆ సామర్థ్యం తగ్గలేదు.