S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రస హృదయం

ఆమని ఆమని ఈ పరుగులు ఏమని
ఏమని ఏమని ఈ రసికతలేమని
చిగురాకుల కదలికలు
చిగురాశల సరసములని
కనివిని మురియని పరవశించని వారెవరని...
మోవిపై మురళిని మోహన రవళిని
సెలయేటి గలగలలని సరిగమ పదనిసలని
కొండకోన మారుమ్రోగ ఎలకోయిల కూతలిని
కనివిని మురియని పరవశించని వారెవరని...

సంధ్యకాంతి జారునని
వెనె్నల విరబూయునని
చెలి కన్నుల కథనాలని
పలు వరసల హసనాలని
సిరిమల్లెలు విరజాజుల
ఎద తలపుల ఊసులిసి
కనివిని మురియని
పరవశించని వారెవరని...

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505