S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శాకాహారంలో మాంసకృత్తులు

ప్రశ్న: ఆరోగ్యాన్నిచ్చే మంచి ప్రొటీన్లు ఏ ఆహార పదార్థాల్లో దొరుకుతాయి? శుద్ధ శాకాహారుల భోజనంలో మంచి ప్రొటీన్లు లేవా? ప్రతీ మనిషీ ప్రొటీన్ల కోసం తప్పనిసరిగా మాంసం తిని తీరాల్సిందేనా? సవివరంగా తెలియజేయండి.
-కె.రాజశ్రీ (తిరుపతి)
జ: శరీరాకృతి నిర్మాణం, మాంస కండరాలకు మరమ్మత్తులు, వాటి పనితీరు మెరుగుపరచుకోవటం అనే విధుల్ని ప్రధానంగా ప్రొటీన్లు నెరవేరుస్తుంటాయి. వీటిని మాంసకృత్తులని పిలుస్తుంటాం. ఈ ప్రొటీన్లు అటు మాంసాహారం నుండీ ఇటు శాకాహారం నుండీ సమృద్ధిగానే లభిస్తుంటాయి. కానీ, మాంస ప్రొటీన్లకీ, శాక ప్రొటీన్లకి వౌలికంగా కొంత తేడా ఉంది. దేని వలన వచ్చే ప్రొటీన్లు ఏ విధమైన లాభనష్టాలను కలిగిస్తాయనే అంశం చర్చించవలసిందే!
ప్రొటీన్లను శరీరంలో అమైనో యాసిడ్లు తయారుచేస్తాయి. శరీరానికి 22 రకాల అమైనో యాసిడ్లు కావాల్సి ఉంది. వాటిలో ముఖ్యమైన 9 అమైనో యాసిడ్లను శరీరం తనకు తానుగా తయారు చేసుకోలేదు. వాటిని అనునిత్యం ఆహారం ద్వారానే మనం పొందగలుగుతాం. వీటిని ‘అత్యవసర అమైనో యాసిడ్లు’ (ళఒఒళశఆజ్ఘ ఘౄజశ్య ఘషజజూఒ) అని కూడా పిలుస్తారు. ఈ తొమ్మిది రకాల అమైనో యాసిడ్లు ఏ భోజనంలో ఉంటాయో అది ప్రొటీన్ సంపన్న భోజనం అవుతుంది.
చేపలు, గుడ్లు, వెన్న, జున్ను, పాలు, గొడ్డుమాంసం, సీమపంది మాంసం, కోడి మాంసం, ఇంకా ఇతర జంతు మాంసాలలో ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్లు సంపూర్ణంగా ఉంటాయి. కూరగాయల ద్వారా ప్రొటీన్లు పొందేప్పుడు వీటిలో ఒకటీ అరా అయినా తక్కువగా వుండే అవకాశం ఉంది. ధాన్యం, పప్పు ధాన్యం, బఠాణీ, సోయాబీను, కొన్ని రకాల కూరగాయలు, పండ్లు, జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు, చిక్కుడు ఇలాంటి వాటిలో ప్రొటీన్ ఇంచుమించు మాంసంతో సమానంగా ఉంటుంది. మాంసాహారం ద్వారా అందని అనేక అదనపు ప్రయోజనాలు కూడా కూరగాయల వలన కలుగుతాయి.
1.శాక భోజనంలో ఆహార పీచు (డైటరీ ఫైబర్) ఎక్కువగా ఉంటుంది.
2.శరీరానికి నేరుగా ఉపయోగించే ఇనుము, బి’ కాంప్లెక్స్ లాంటి ఇతర పోషకాలతో శాక భోజనంలో తేలికగా శరీరానికి వొంటబట్టేవిగా ఉంటాయి.
3.శాక భోజనంలో ఫైటో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైటో అంటే గ్రీకు భాషలో మొక్క. మొక్కల్లోని పోషక రసాయనాల్ని ఫైటో న్యూట్రియంట్స్ అంటారు. ఇవి సూక్ష్మ జీవుల నుండి, ఫంగస్ ఇతర క్రిమి కీటకాల నుండి శరీరానికి రక్షణ నిస్తాయి. మాంసాహారం మాత్రమే తినేవారికి ఈ ఫైటో న్యూట్రియంట్స్ తగినంతగా శరీరానికి అందవు. ఆహార ధాన్యం, పప్పు ధాన్యం, బీన్స్, పండ్లు, కూరగాయలు తినే వారికి ఇవి పుష్కలంగా అందుతాయి.
4.శాక భోజనంలో అనామ్ల జనకాలు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆక్సీకరణం లేదా ఆక్సిడేషన్ అంటే ఆ పదార్థంలోంచి ఎలక్ట్రాన్లు కొన్ని కోల్పోవటం. ఉదాహరణకు ఇనుములోంచి ఒక ఆక్సిజన్ కణం తగ్గిందనుకోండి.. ఆ ఇనుము తుప్పు ఎక్కి బలహీనపడి పోతుంది. అంటే ఆక్సీకరణం జరిగిందని అర్థం. ఆ ఆక్సీకరణాన్ని ఆపగలిగేది యాంటీ ఆక్సిడెంటు. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ లాంటివి యాంటీ ఆక్సిడెంటుగా పని చేసే వాటిలో ముఖ్యమైనవి. ముఖ్యంగా కేన్సర్ లాంటి వ్యాధుల్ని ఇవి నిరోధించగలుగుతాయి. శుద్ధ మాంసాహారులకు ఈ ప్రయోజనాలు దక్కవనే చెప్పాలి.
5.మాంసాహారం ద్వారా చెడ్డ కొవ్వు శరీరంలోకి ఎక్కువగా వెడుతుంది. ముఖ్యంగా గొడ్డుమాంసం ద్వారా వెళ్లే కొవ్వు శాకాహారం ద్వారా వెళ్లే కొవ్వుకన్నా గుండెకు ఎక్కువ అపకారం చేస్తుంది. ఈ జంతు మాంసంతో పోలిస్తే చేపలు కొంతలో కొంత నయం అని చెప్తారు. కూరగాయల్లో పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి వాటిలో ఉండే కొవ్వుని అవి కొంత అదుపు చేయగలుగుతాయి. కూరగాయల్లో మాత్రమే ఆహార పీచు (డైటరీ ఫైబర్) ఉంటుంది. మాంసాహారంలో పీచు పదార్థాలు ఉండవు. ఈ తేడాని గమనించాలి.
6.కేవలం ప్రొటీన్ వరకూ మాత్రమే ఆలోచిస్తే, జంతు మాంసం ద్వారా ప్రొటీనే్ల గొప్పవి కావచ్చు. కానీ, వాటివలన అపకారం అంతకన్నా ఎక్కువ జరుగుతుంది. గొడ్డు మాంసం, ఆల్కహాల్, ధూమపానం, గుట్కాలు ఇవన్నీ తోడైతే లైఫ్ రిస్కు ఎక్కువగా ఉంటందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. కూరగాయలు ఈ ప్రమాదాలను నివారించటానికి తోడ్పడతాయి.
7.పెరుగు మీద తేరిన తేటలో కండరాలను బలసంపన్నం చేసే ప్రొటీన్ ఉంటుంది. దీన్ని జ్దీళక -్యఆళజశ అంటారు. రాత్రి చిలికిన చిక్కని మజ్జిగలో రెండు రెట్లు నీళ్లు కలిపి తెల్లవార్లూ ఫ్రిజ్‌లో పెట్టకుండా ఉంచేసి, ఉదయం వాకింగ్, వ్యాయామం చేసి రాంగానే ఆ పలుచని మజ్జిగ లేదా దాని పైన తేరిన నీటిని తాగటం ఒక మంచి అలవాటు. ఇది ప్రోబయటిక్ ఔషధం. ఉపయోగపడే సూక్ష్మజీవులు కూడా దీని ద్వారా కడుపులోకి చేరి పేగుల్ని సంరక్షిస్తాయి. కండరాలు పట్టేసే వ్యాధిలో ఇది ఎక్కువ ఉపయోగపడ్తుంది.
8.అన్నం ఉడికించి వార్చిన గంజిలో కూడా మేలు చేసే ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. దానికి రైస్ సూప్, పారిడ్జి లాంటి ఇంగ్లీషు పేర్లు పెడితే పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఈ మజ్జిగ ద్వారా తీసిన ప్రొటీన్‌ని పౌడరు రూపంలో కూడా అమ్ముతున్నారు.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com