S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సిమీపై ఓ కనే్నయండి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం పూర్తి అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతోంది. దీనిలో భాగంగానే నిషేధిత తీవ్రవాద సంస్థ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ)పై దృష్టిపెట్టింది. సిమీకి నిధుల సేకరణ, దాని కార్యకలాపాలపై ఓ కనే్నసి ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు పూర్తి అధికారులు ఇచ్చింది. దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా యువత, విద్యార్థులే విధ్వంసక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు ఇంటిలిజెన్స్ నివేదికలు కథనాల నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చట్టం 1967 కింద సిమీపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగిస్తూ కేంద్రహోమ్‌శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సిమీకి నిధులు అంజేస్తున్న సంస్థలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలను కేంద్రహోమ్‌శాఖ ఆదేశించింది. ఎక్కడా అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసిం ది. గతంలో సిమీ కార్యకర్తలపై దాఖలైన కేసులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మతం పేరిట సమాజంలో వైషమ్యాలు సృష్టించే సిమీ పట్ల కఠినంగా ఉండాలని ఆదేశించింది. విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడినట్టు సిమీపై ఇప్పటికే 58 కేసులు నమోదయ్యాయి. 2017లో గయలో జరిగిన పేలుళ్లు, 2014లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన పేలుళ్లు, 2014లో జైలుదాడి ఘటనలో సిమీపై ఆరోపణలున్నాయి. 1977 ఏప్రిల్ 25న యూపీలో ని ఆలీగఢ్‌లో సిమీ ఆవిర్భవించింది. భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా చేయాలన్న అజెండాతో విచ్ఛిన్న కార్యక్రమాలు నడిపింది. దీంతో ప్రభుత్వం 2001లో నిషేధం అమలు చేసింది. అప్పటి నుంచి నిషేధం పొడిగిస్తూ వస్తోంది.