S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిరుజల్లులు

ఒకటే
చీకటిలో
అన్ని రంగులూ ఒకటే
స్మశానంలో
అన్ని కులాలూ ఒకటే

* జగమంతా దగాదగా
మోసమే బతుకుదెరువైన
లోకంలో
ప్రతి జేబులోను
పాపపు సొమ్మే

* హామీ
గెలిపిస్తే పేదరికం
తొలగిస్తానన్నాడు
తీరా గెలిచాక
పేదల్నే పైకి పంపిస్తున్నాడు
ఎలాగైతేనేం
హామీ నెరవేరుస్తున్నాడు

* రుచి మారుద్ది
చెప్పుడు మాటలు
ఆలకించేటప్పుడు తియ్యగా
అనుభవించేటప్పుడు చేదుగా
ఉంటాయ్

* ఎడబాటు
ఐదేళ్ల ఎడబాటు తర్వాత
ఎన్నికల పండక్కి
లీడర్లు ఓటర్లు
ఎదురుపడుతున్నారు

* పండుగ
పండుగ పిల్లలకి
ఖర్చులు పెద్దలకి
ఆనందం అందరికి

* ఒకవైపే...
వ్యాపారాలు లాభాలే చేస్తున్నారు
అధికారులు లంచాలే చూస్తున్నారు
నేతలు ఓట్లే చూస్తున్నారు
దిక్కులేక బడుగులు పైకి చూస్తున్నారు.

- చిరమన వెంకట రమణయ్య 9441380336