S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం( (17-3-2019 నుంచి 23-3-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలపైన దృష్టి. సౌఖ్యంగా గడుపుతారు. ప్రయాణావకాశాలు. విద్యారంగంలో అభివృద్ధి. గృహ వాహనాదుల విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వృత్తి ఉద్యోగాదులపై దృష్టి ఉంటుంది. కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. వ్యాపారాదుల్లో లాభాలు సంతోషాన్నిస్తాయి. వారం మధ్యమంలో అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గం వల్ల సంతృప్తి. సృజనాత్మకత. కొత్త ఆలోచనలు. ప్రణాళికలకు అనుకూలం. లాభాలపై ఆసక్తి. ప్రయోజనాపేక్షతోనే కొన్ని పనులు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. వారాంతంలో అన్ని పనుల్లోనూ ఒత్తిడులుంటాయి. పోటీ రంగంలో అనుకూలత. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు కోసం ప్రయత్నం. శ్రమ తప్పకపోవచ్చు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులపై దృష్టి. విశ్రాంతిగా గడుపుతారు. విహారాలు, విందులు, వినోదాలకు చక్కని అవకాశం. ప్రయాణాలుంటాయి. వ్యతిరేకతలున్నా అధిగమిస్తారు. పోటీ రంగంలో విజయం సాధిస్తారు. మానసికమైన కొన్ని ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఆలస్య నిర్ణయాదుల వల్ల ఇబ్బంది. పరిచయాలు, వ్యాపారానుబంధాలు వృద్ధి పొందుతాయి. వారం మద్యమంలో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతలు విస్తరిస్తాయి. కార్యనిర్వహణ దక్షత. భాగస్వామ్యాలకు అనుకూలం. పరిచయాల్లో శుభ పరిణామాలు. ఆలోచనల్లో కొంచెం నైరాశ్యం ఉంటుంది. వ్యతిరేకతలున్నా శ్రమతో అధిగమిస్తారు. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలకు అవకాశం. ఊహించని సంఘటనలుంటాయి. కొత్త పనులను వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో కొన్ని సమస్యలుంటాయి. ఆర్థిక నిల్వల విషయంలో జాగ్రత్త. ఆలస్య నిర్ణయాదుల వల్ల సమస్యలు. మాటల్లో కొంత చమత్కారం. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకునే ప్రయత్నం. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి. వైజ్ఞానిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. సుదూర ప్రయాణాలు. సంప్రదింపులకు అనుకూలం. నిర్ణయాదుల్లో కొంత నైరాశ్యం. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు అందుతాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. ఉన్నత విద్యావకాశాలు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కొన్ని అనుకోని సమస్యలకు అవకాశం. జాగ్రత్త అవసరం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. వారం మధ్యలో విద్యారంగంపై ఆసక్తి. కొత్త చదువులపై దృష్టి. శ్రమ ఉన్నా సంతోషంగా గడుపుతారు. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. ఉన్నత లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి. సుదూర ప్రయాణావకాశాలు. వారాంతంలో అభీష్టాలు నెరవేరుతాయి. సృజనాత్మకత. ప్రణాళికలు ఫలిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు. అధికారిక లాభాలుంటాయి. వ్యర్థమైన ఖర్చులకు కూడా అవకాశం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ప్రయోజన దృష్టి ఉంటుంది. అన్ని పనుల్లోనూ లాభాపేక్ష. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొంత ఒత్తిడి ఉన్నా సమస్యలను అధిగమించి ప్రయోజనాలు సాధిస్తారు. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సౌకర్యాల విషయంలో జాగ్రత్త. ఆహార విహారాల్లో లోపాలు. పోటీ రంగంలో విజయం. గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. ప్రయాణాలకు అవకాశం. అధికారిక హోదాల కోసం తిరగడం తప్పకపోవచ్చు. విశ్రాంతి లభిస్తుంది. పరామర్శలకు అవకాశం. పోటీ రంగంలో విజయం సాధిస్తారు. కొంత శ్రమ ఉంటుంది. అభీష్టాలు నెరవేరుతాయి. సంతానంతో సంతోషం. వారాంతంలో కొత్త పనులు. నూతన నిర్ణయాలు. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో పరిచయాలు పెంచుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆత్మవిశ్వాసంతో కార్యనిర్వహణ చేస్తారు. బాధ్యతలు విస్తరిస్తాయి. కొత్త కార్యక్రమాలపై దృష్టి. ప్రయాణాదుల్లో జాగ్రత్త. వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. సంతోషంగా గడుపుతారు. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులకు అవకాశం. జాగ్రత్త వహించాలి. ప్రయాణాదుల్లో నిరాశ ఉంటుంది. స్ర్తి వర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. వారాంతంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. గౌరవం పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెంచుకుంటారు. నిల్వధనంపై ప్రత్యేక దృష్టి. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలకు కూడా అవకాశం. జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. పరిచయాలు ఇబ్బంది పెట్టవచ్చు. ఉన్నత లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. కొన్ని వార్తల వల్ల కొంత ఒత్తిడి పెరిగే అవకాశం. దగ్గరి ప్రయాణాలుంటాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి. ఉన్నత కార్యక్రమాల నిర్వహణ. రూపకల్పన. కొత్త పరిచయాల్లో జాగ్రత్త అవసరం. స్ర్తి వర్గంతో సమస్యలకు అవకాశం. వారాంతంలో ఆహార విహారాలుంటాయి. సంతోషంగా గడుపుతారు. శ్రమ తప్పకపోవచ్చు. సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తిలో మార్పులు ప్రభావితం చేస్తాయి. ఉద్యోగ వృద్ధి, వ్యాపారాదుల్లోనూ కొంత శ్రద్ధ అవసరం. తండ్రి వర్గ వ్యవహారాలకు అవకాశం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. సేవక వర్గంతో సంప్రదింపులు. సహకారం లభిస్తుంది. ఆలోచనలకు రూపకల్పన. వారం మధ్యమంలో లాభాలు ప్రభావితం చేస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. నూతన కార్యక్రమాల నిర్వహణ, రూపకల్పన. సంతోషంగా గడుపుతారు. అభీష్టాలు నెరవేరుతాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. వార్త వల్ల సమస్యలుంటాయి. సృజనాత్మకత పెంచుకుంటారు. వ్యాపార వృద్ధి. వారాంతంలో ఖర్చులు అధికం. కొన్ని పెట్టుబడులు తప్పకపోవచ్చు. ప్రయాణాలుంటాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు ఒత్తిడులున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. శత్రువులపై గెలుపు. రుణాలను తీర్చే ప్రయత్నం. ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. లాభాల కోసం ఎదురుచూస్తారు. ఆశించిన ప్రయోజనాలు అందవు. ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాల నిర్వహణ. వారం మధ్యమంలో పరిచయాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాల్లో శుభ పరిణామాలు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొత్త పనులపై దృష్టి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలు విస్తరిస్తాయి. కార్యనిర్వహణ దక్షత. సామర్థ్యాన్ని చూపిస్తారు. పెద్దలతో కొంత జాగ్రత్త. విలాసాలు విందుల కోసం వెచ్చిస్తారు. వారాంతంలో ఆరోగ్య సమస్యలకు అవకాశం. వ్యాపారాదుల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులపై దృష్టి. బాధ్యతలు విస్తరిస్తాయి. మనోల్లాసం. కార్యనిర్వహణలో సంతృప్తి. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. వ్యతిరేకతలు అధికం. పోటీలు, ఒత్తిడులను అధిగమించాలి. వ్యాపారాదుల్లో జాగ్రత్త. అనుకోని ఇబ్బందులుంటాయి. వారం మధ్యమంలో కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక నిల్వలపై ప్రత్యేక దృష్టి. మాట తీరు వల్ల కొంత మంచి మార్పులకు అవకాశం. కొన్ని అనుకోని సమస్యలు కూడా ఉంటాయి. అనారోగ్య భావనలను అధిగమించాలి. పోటీ రంగంలో ఇబ్బందులకు అవకాశం. పరిచయాలు స్నేహానుబంధాలు భాగస్వామ్యాలకు అనుకూలం. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. ప్రయాణావకాశాలు. విహార యాత్రలకు అవకాశం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. గౌరవం పెంచుకుంటారు. సుదూర ప్రయాణాలు. అత్యున్నత విద్యలపై ఆసక్తి. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. సంప్రదింపులకు అనుకూలం. కుటుంబంలో ఒత్తిడులుంటాయి. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. వారం మధ్యలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక కార్యక్రమాలు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. పితృవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. పదోన్నతులకు అవకాశం. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. శ్రమ ఉన్నా సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. మాటల్లో కొంత నైరాశ్యం. స్ర్తి వర్గంతో సంప్రదింపులు. వారాంతంలో అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. ప్రయోజనాలు సంతోషాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో సంతాన వర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. పనుల్లో క్రియేటివిటీ కనిపిస్తుంది. నిర్ణయాదులకు అనుకూలం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కొత్త పనులపై దృష్టి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాపేక్ష ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్త. వ్యాపారాదుల కోసం పెట్టుబడులు తప్పకపోవచ్చు. వారం మధ్యమంలో పోటీలు వత్తిడులుంటాయి. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గుర్తింపు లభిస్తుంది. శారీరకమైన ఒత్తిడులుంటాయి. ఖర్చులు పెట్టుబడులు తప్పకపోవచ్చు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు. వారాంతంలో పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో అనుకూలత. కొత్త పనులపై దృష్టి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744