S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇండోనేషియాలో పెట్టుబడులకు భారత్ కంపెనీలు సిద్ధం

సింగపూర్: భారత్ వౌలిక సదుపాయాల ప్రాజెక్టులు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల ఇండోనేషియా కంపెనీలు స్వాగతిస్తున్నాయి. రెండవ భారత్ ఇండోనేషియా వౌలిక సదుపాయాల ఫోరం సదస్సులో ఇండియన్ కంపెనీల సీఈవోల సదస్సు జరిగింది. ఈ సమావేశంలో సముద్ర ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి లూహుట్ బిరిసర్ పండ్‌జైతాన్ మా ట్లాడుతూ తమ దేశంలో ఊహించని విధంగా మంచి పెట్టుబడులు పెట్టేందుకు భారత్ కంపెనీలు క్యూ కడుతున్నాయని, ఇది మంచి పరిణామమన్నారు. ఇండోనేషియా ప్రభుత్వం వౌలిక సదుపాయా ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏక్ ప్రొవిన్స్ గవర్నర్ నోవా ఇరిన్‌సైయా మాట్లాడుతూ భారత్, ఇండోనేషియా మధ్య మంచి అనుసంధానం ఉందన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలమైనవన్నారు. ఇరుదేశాలు సమన్వయంతో ముం దడుగు వేయాలన్నారు. ఇండోనేషియాలో భారత్ అంబాసిడర్ ప్రదీప్ రావత్ మాట్లాడుతూ, రెండు దేశాల పారిశ్రామికవేత్తల సదస్సులను తరచుగా నిర్వహించాలన్నారు. వౌలిక సదుపాయాల అభివృద్ధి బాగున్నప్పుడే అభివృద్ధి వేగవంతమవు తుందన్నారు. వి ద్యుత్, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, వాటర్ రిసోర్సస్, హాస్పిటల్ మే నేజ్‌మెంట్, ఆటోమోటివ్, రోడ్లు, ఉపరితల రవాణా, తదితర రంగా ల్లో ఇరు దేశాలు అభివృద్ధికి ఆసక్తిగా ఉన్నాయన్నారు. సమావేశం లో జీఎంఆర్, జీవీకే, బీహెచ్‌ఈఎల్, అదానీ, ఎల్ అండ్ టీ, టాటా పవర్, టీసీఎస్, టెక్ మహీంద్ర ఇతర కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సదస్సులో ఇండోనేషియాకు చెందిన 75 కంపెనీలు పాల్గొన్నాయి.