S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాకిస్థాన్‌కు అమెరికా హితవు

వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలపై నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు అమెరికా హితవు పలికింది. మరోసారి భారత్‌పై దాడిజరిగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు వైట్‌హౌస్ అధికారి ఒకరు విడుదల చేసిన ప్రకటనలో ఉగ్రవాద నిర్మూలనకు పాక్ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, పాక్ చేపడుతున్న చర్యలను ఇపుడే అంచనా వేయలేమని అన్నారు. జేషే మహ్మద్ వంటి సంస్థల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నా, ఉగ్ర సంస్థల ఆస్తులు జప్తుచేస్తున్నా ఇపుడే ఒక అంచనాకు రాలేమని, గతంలోనూ ఉగ్రవాద సంస్థల నేతలను అరెస్టు చేసి కొంతకాలం తరువాత విడుదల చేశారని గుర్తుచేశారు. పూల్వామా వంటి ఉగ్రదాడి మరొకటి భారత్‌పై జరిగితే అది పాకిస్థాన్‌కు పెను ప్రమాదాన్ని సృష్టిస్తుందని హెచ్చరిస్తూ.. ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంది. ఏదిఏమైనా ఇరుదేశాలు ఇపుడు సంయమనంతో ఉన్నప్పటికీ సరిహద్దుల వద్ద సైనిక బలగాలు మోహరించే ఉన్నాయని వైట్‌హౌస్ పేర్కొంది.