S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘కోడ్’ఉల్లంఘించ లేదు

చెన్నై, మార్చి 21: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన సందర్భంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు వచ్చిన వార్తలపై రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ‘రాహుల్ కోడ్‌ను ఉల్లంఘించలేదు’ అని తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారి సత్యబాత్రా సాహూ స్పష్టం చేశారు. చెన్నైలోని స్టెల్లా మెరీస్ మహిళా కళాశాల విద్యార్థినులతో ఈ నెల 13న రాహుల్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇది కోడ్ ఉల్లంఘనేని విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థినులతో ముఖాముఖికి సంబంధించి నివేదిక తెప్పించుకుని రాహుల్ ఉపన్యాసాన్ని పరిశీలించినట్టు ఆయన చెప్పారు. అందులో ఎక్కడా ‘కోడ్’ ఉల్లంఘన లేదని ఆయన స్పష్టం చేశారు. స్టెల్లా మేరీస్ కాలేజీ ముఖాముఖికి సంబంధించి ముందే అనుమతి తీసుకున్నట్టు డీఈవో నివేదించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాహుల్ ముఖాముఖి దాని పరిధిలోకే వస్తుందని, దీనిపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాలేజీ విద్యా డైరెక్టర్ ఆర్ సారుమతిని తన కింది అధికారులను విచారణకు ఆదేశించారు. విద్యార్థినులతో రాహుల్ ముఖాముఖి సందర్భంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, రాఫెల్ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.