S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒడిసాలో హోరెత్తనున్న బీజేపీ ప్రచారం

భువనేశ్వర్, మార్చి 21: వచ్చే నెలలో నాలుగు విడతలుగా జరిగే ఒడిసా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రముఖులు హోరెత్తించనున్నారు. ఇక్కడ ఏప్రిల్ 11, 18, 23, 29 తేదీల్లో నాలుగు విడతలుగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించడానికి ప్రధాని మోదీ సహా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, సినీనటి హేమమాలిని సహా తొమ్మిది మంది తారలు రానున్నారు. తమ పార్టీ తరఫున ప్రచారం చేసే వారి 40 మంది ప్రముఖుల పేర్లను బీజేపీ బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు వారి లిస్టును ఆ పార్టీ నేతలు గురువారం ఒడిసా ముఖ్య ఎన్నికల అధికారికి సమర్పించారు. ఇక్కడ 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ స్థానాలకు నాలుగు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారానికి బీజేపీ తరఫున ప్రదాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, ప్రకాష్ జావడేకర్, జూయల్ ఓరమ్, ధర్మేంద్ర ప్రధాన్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర వంటి ప్రముఖులు రానున్నారు. వీరేగాక, బీజేపీకి చెందిన మాజీ సీఎంలు రమణసింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, అర్జున్ ముండా, ఒడిసా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగోతో పాటు సినీనటులు మిహిర్ దాస్, సీతారాం దాస్, మహాశే్వత రే, అపరాజిత మహంతి, అను చౌదరి, పింకీ ప్రధాన్, అశ్రునోచన్ మహంతి, హరిహర్ వంటి వారు సైతం బీజేపీ ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. ఇలావుండగా ఒడిసాలో బీజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా 19 సంవత్సరాలుగా రాష్ట్రంలో అప్రతిహతంగా పాలన సాగుతోంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 147 స్థానాలకు బీజేడీ 117, బీజేపీ 10, కాంగ్రెస్ 16, మిగిలినవి ఇతరులు దక్కించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 21 స్థానాలకు బీజేడీకి 20రాగా, బీజేపీ ఒకటి మాత్రమే దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో తమ సీట్ల సంఖ్యను పెంచుకుని ఆ రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది.