S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రధాని రేసులో ఉంటా!

లక్నో, మార్చి 21: ఈ సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ప్రకటనపై చెలరేగిన గందరగోళంపై గురువారం ఆమె వివరణ ఇచ్చారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే.. దాని అర్థం ప్రధాన మంత్రి పదవికి పోటీ నుంచి తప్పుకోవడం అని కాదు.. ఎవరైనా మంత్రిగా గాని, ప్రధాన మంత్రిగా గాని పదవిని చేపట్టిన ఆరు నెలల్లోపు పార్లమెంట్‌కు ఎన్నిక కావచ్చు... కాబట్టి కార్యకర్తలారా ధైర్యాన్ని కోల్పోవద్దు’ అని ఆమె ట్వీట్ చేశారు. తాను 1995లో మొదటిసారిగా యూపీ ముఖ్యమంత్రి అయినప్పుడు అసెంబ్లీలో కాని, కౌన్సిల్‌లో కాని సభ్యురాలు కాదని, తర్వాతే చట్టసభకు ఎన్నికయ్యానన్న విషయాన్ని గుర్తుచేస్తూ, అదే విధంగా ఇప్పుడు సైతం మంత్రి, ప్రధాన మంత్రి అయితే ఆరు నెలల్లోపు ఏదో ఒక స్థానం నుంచి చట్టసభకు ఎన్నిక కావచ్చునని మాయావతి వివరించారు. లోక్‌సభ ఎన్నికలకు ఒకప్పటి ప్రత్యర్థి అయిన సమాజ్‌వాద్ పార్టీతో పొత్తుపెట్టుకుని పోటీలో దిగుతున్న మాయావతి, బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ వచ్చే నెల నుంచి జరిగే సార్వత్రిక ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని, తమ పార్టీ, కూటమి పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ వర్గాలు అర్థం చేసుకుంటాయని భావిస్తున్నానని, ప్రస్తుతమైతే ప్రచారం మీద తన పూర్తి దృష్టి అని ఆమె లక్నోలో పేర్కొన్నారు. కాగా, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సైతం పలుసార్లు తాను మాయావతిని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇటీవల యూపీలో బీజేపీ సిట్టింగ్ స్థానాలైన గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ ఎంపీ స్థానాలకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో యూపీ, బీఎస్పీ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో రెండు పార్టీల కూటమి ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకుని ఆ మేరకు గోదాలోకి దిగుతున్నాయి. ఇలావుండగా, బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో దించాలన్న లక్ష్యంతో విపక్షాలన్నీ కలిసి ఏర్పడిన మహాకూటమి లక్ష్యానికి మాయావతి తూట్లు పొడిచారని కొన్ని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. తొలుత మహాకూటమిలో భాగస్వామిగా ఉంటానన్న మాయావతి తర్వాత మాట మార్చి దేశంలోనే అతి ఎక్కువగా 80 నియోజకవర్గాలున్న యూపీలో తాము కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయమని పేర్కొని, కేవలం ఎస్పీతోనే పొత్తు పెట్టుకోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఎస్పీ-బీఎస్పీ ఒక కూటమి, కాంగ్రెస్ ఇతర పక్షాలు మరో కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అది బీజేపీకే లబ్ధి చేకూరుస్తుందని వారు వాదిస్తున్నారు.