S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనసుతోనే వ్యధ !( ఓషో బోధ )

అది సహజం. విజయం మీకు మనశ్శాంతి లేకుండా చెయ్యడమేకాక, జీవితంలో అత్యంత విలువైన నిశ్శబ్దము, ప్రశాంతత, ప్రేమ, ఆనందాలు వంటి అన్నింటిని దోచుకుంటుంది. కాబట్టి, వెంటనే మీకు మనశ్శాంతి అవసరమవుతుంది. అది ఎలా సాధించాలో చెప్పేందుకు మనసు గురించి ఏమీతెలియని అనేకమంది సిద్ధంగా ఉంటారు.
‘‘జోషువా లైబ్‌మేన్’’అనే యూదు రబ్బీ రచించిన ‘‘పీస్ ఆఫ్ మైండ్’’అనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరువాత మనసు గురించి, శాంతి గురించి అతనికి ఏమీతెలియదని తెలిసింది. కానీ, అతను ఒక గొప్ప వ్యాపారవేత్త. అందువల్ల అతనికి మనశ్శాంతి గురించి ఏమీ తెలియదు.కానీ, అతని రచనాశైలి చాలా చక్కగా ఉంటుంది. అందుకే మనశ్శాంతి కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఆ పుస్తకాన్ని కొనడంతో అమ్మకాలు చాలా జోరుగా సాగాయి. కానీ, ఆ పుస్తకం చదివిన వారికి మనశ్శాంతి దక్కకపోగా, అది వారికి మరింత దూరమైంది. నిజానికి, మనసు గురించి, శాంతి గురించి తెలిసిన వ్యక్తి ‘‘పీస్ ఆఫ్ మైండ్’’అనే పుస్తకాన్ని రాయలేడు. ఎందుకంటే, అశాంతికి, వేదనకు మనసే మూల కారణం.
కాబట్టి, మనోరహిత స్థితిలో మాత్రమే అసలైన శాంతి లభిస్తుంది. అంటే, మనసు ఉంటే శాంతి ఉండదు, శాంతి ఉన్నప్పుడు మనసు ఉండదు. కాబట్టి, మనశ్శాంతి అనేది ఒక వస్తువులా ఎక్కడా ఉండదు. అందుకే నేను ‘‘పీస్ ఆఫ్ నో మైండ్’’అనే పుస్తకాన్ని రాయాలనుకున్నాను. కానీ, దానిని ఎవరూ కొనరు, చదవరు. ఎందుకంటే, అది ఎవరికీ అర్థం కాదు. అందుకే నేను ఆ పుస్తకాన్ని రాయలేదు. కానీ, ‘‘పీస్ ఆఫ్ నో మైండ్’’ అనేదే అసలైన వాస్తవం.
తనతోపాటు ఏమితెచ్చుకున్నాడో పసివాడికి తెలియదు. ఆ వ్యాపారవేత్త కూడా అదేస్థితిలో ఉన్నాడు. ప్రపంచంలో ఉండే అత్యంత విలువైనవన్నీ అతని దగ్గర ఉన్నాయి. కానీ, అతనికి మనశ్శాంతి లేదు. దానికోసం అనే్వషిస్తూ అతడు అనేకమంది ఋషులను కలిసాడు. వారు అతనికి అనేక ఉచిత సలహాలు ఇచ్చారు. కానీ, అవి పనిచెయ్యలేదు. ఎందుకంటే, ఉచిత సలహాలు ఎవరికీ సహకరించవు.
నిజానికి, మూర్ఖులు మాత్రమే సలహాలు ఇస్తారు, తీసుకుంటారు. జ్ఞానులు ఆ పని చెయ్యరు. ఎందుకంటే, ఉచితంగా ఇవ్వగలిగేది కేవలం సలహాలు మాత్రమే అని, ఉచిత సలహాలను ఎవరూ పాటించరని జ్ఞానులకు తెలుసు. అందుకే వారు ఆ పని చెయ్యరు.
నిజానికి, ఏ జ్ఞాని అయినా తన సలహాను పాటించేందుకు సిద్ధపడేలా ముందుగా మీకు శిక్షణఇస్తాడు. అంతవరకు అతడు మీకు ఎలాంటి సలహాఇవ్వడు. అందుకు కొన్ని సంవత్సరాలుకూడా పట్టవచ్చు. అప్పుడే అతడు మీలో బీజాలను నాటగలడు. కేవలం మూర్ఖులుమాత్రమే ఫలితాలను పట్టించుకోకుండా రాళ్ళు, రప్పలపై విత్తనాలను చల్లుతూ, వాటిని వృథాచేస్తారు.
చివరికి మనశ్శాంతికోసం అనే్వషిస్తున్న ఆ వ్యాపారవేత్తను ఒకడు దారిలో ఆపి ‘‘అనవసరంగా మీరు మీ సమయాన్ని వృథాచేసుకుంటున్నారు. ఇంతవరకు మీరు కలిసిన ఋషులందరూ నాకు తెలుసు. కానీ, వారెవరూ ఋషులు కారు. ఇలా అంటున్నందుకే నేను అందరికీ మూర్ఖుడిలా కనిపిస్తున్నాను. అందుకే నన్ను ఎవరూ ఏదీ అడగరు. నేనుకూడా ఎవరికీ ఏదీ చెప్పను. ఎందుకంటే, నామాట ఎవరూ నమ్మరు. బహుశా, మీరుకూడా నా మాట నమ్మకపోవచ్చు. కానీ, మనశ్శాంతికోసం మీరు పడుతున్న అవస్థలు చూస్తుంటే తట్టుకోలేక మీరు అడగకపోయినా చెప్పాలనిపించి చెప్తున్నాను. ఒక ఋషి నాకు తెలుసు.
- ఇంకాఉంది
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.