S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేను.. నిర్వాణ స్రోతస్సుని..

-1-
నేను
ప్రకృతి పురుష
స-రసధునిని
అస్తిత్వ అభేదాన్ని
పురుషలో ప్రారంభమైన
తొలి ప్రస్థానాన్ని
ప్రకృతి పొదువుకున్న
మలి అవతారాన్ని
మాతృగర్భాన
పరిణమిస్తున్న
అంతస్తత్వాన్ని
సృష్టి కావ్యానికి
కదులుతున్న
అధ్యాయాన్ని
రూప ప్రబంధానికి
సాంద్రమవుతున్న
ముఖచిత్రాన్ని
శబ్ద శతకానికి
విశుద్ధ రాగాన్ని
స్వరసంతకాన్ని
సరాగ విరాగ
కవితాకుండలినిని
సహస్రారవిందాన్ని
-2-
నేను
మట్టి మనిషిని
మట్టిని మథించిన కుమ్మరిని
మట్టిన మొలిచిన కర్మిష్ఠిని
అవును
నేను
మట్టి మంత్రాన్ని
భౌగోళిక యంత్రాన్ని
పాంచభౌతిక తంత్రాన్ని
*
నేను
నవ ఆలయాన్ని
గాలి గోపురాన్ని
గగన చుంబితాన్ని
*
అవునవును,
నేను
నీటి కడవను
అగ్గి గడపను
బ్రతుకు గెడను
*
నేను
ప్రాపంచిక ఫలాన్ని
పంచభూత ఫలితాన్ని
పాంచభౌతిక గురుత్వాన్ని
*
అన్నట్టు
నేను
మూలాధార సుఖాసనాన్ని
అనాహత ప్రేమోదంతాన్ని
విశుద్ధ స్వరాభిషేకాన్ని
*
నేను
ఇహానికి కొసమెరుపును
పరానికి తొలిమలుపును
చీకటి వెలుగుల వేల్పును
*
అయినా,
నేను
తారక రహస్యాన్ని
తారకల వారసత్వాన్ని
తారాసందోహ వౌనాన్ని
*
నేను
మట్టి ప్రమిదెను
అయినా
అఖండ జ్యోతిని
*
నేను
మట్టి మూకుడును
అయినా
నవధాన్య దోసిలిని
*
నేను
మట్టి ప్రతిమను
అయినా
మెట్టినింటి గర్భాన్ని
*
నేను
అక్షతల అక్షరగర్భను
అయినా
అస్థికల అక్షయ పేటికను
*
నేను
మట్టిన పుట్టినవాడిని
మట్టిన శ్వాసించినవాడిని
మట్టిన నిష్క్రమించేవాడిని
*
అవునవును, నేను
మట్టి పుట్టను
మట్టి పట్టును
మట్టి మనీషిని
-3-
నేను
సృష్టిని
స్థితి తంత్రాన్ని
*
నేను
శ్రౌతాన్ని
మూల ఆధారాన్ని
*
నేను
నాదాన్ని
వౌన కేంద్రాన్ని
*
నేను
శ్రీచక్రాన్ని
హృదయగుండాన్ని
*
నేను
గళాన్ని
కాలగీత చరణాన్ని
*
నేను
సర్పాన్ని
అమృత కుబుసాన్ని
*
నేను
చీకటిని
కనుపాపల రహస్యాన్ని
*
నేను
వెలుగును
కనురెప్పల క్రాంతిని
*
నేను
ఫాలనేత్రను
కుడిఎడమల నెలవును
*
నేను
శవాన్ని
పర అరవిందాన్ని.
*
నేను
అరూపాన్ని
అపురూప వలయాన్ని
*
నేను
సమాధిని
నిర్వాణ స్రోతస్సుని..

-విశ్వర్షి 93939 33946