S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిర్మలత్వమే శాంతికిమార్గం( ఓషో బోధ )

పక్కనే ఉన్న గ్రామంలో ఆయన ఉంటారు. వెంటనే వెళ్ళి ఆయనను కలవండి. మీ సమస్య తీరుతుంది’’ అన్నాడు.
అతని సూచనమేరకు ఆ వ్యాపారవేత్త ఒక సంచినిండా వజ్రాలు తీసుకుని, గుర్రంపై ఆ గ్రామానికి వెళ్ళి విచారించగా, ఆ గ్రామస్థులు అతనికి ‘‘ముల్లానసిరుద్దీన్’’అనే వ్యక్తిని చూపించారు. అతనిని చూడగానే ‘‘వీడువాడికన్నా మూర్ఖుడిలా ఉన్నాడు. ఆ మూర్ఖుడు చెప్పడం, వేరే గతిలేక నేను రావడం... అంతా వింతగా ఉంది. అయినా ప్రయత్నించడంలో తప్పేముంది’’అని మనసులో అనుకుంటూ ‘‘నాకు మనశ్శాంతిని ప్రసాదించగలరా?’’అని ముల్లానసిరుద్దీన్‌ను అడిగాడు. వెంటనే ముల్లా ‘‘తప్పకుండా ప్రసాదిస్తాను’’ అనగానే, ‘‘నేను చాలామంది ఋషులను కలిసాను. వారు ‘‘క్రమశిక్షణతో జీవిస్తూ, బీదలకు దానధర్మాలు చెయ్యి, ఆసుపత్రి కట్టించు, పేద పిల్లలకు చదువు చెప్పించు, అది చెయ్యి, ఇది చెయ్యి’’అంటూ నాకు అనేక సలహాలిచ్చారు. వారు చెప్పినట్లు అన్నీ చేసాను. అయినా నాకు మనశ్శాంతి దక్కకపోగా, మరిన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు మీరు నాకు మనశ్శాంతిని ప్రసాదిస్తానంటున్నారు’’ అన్నాడు ఆ వ్యాపారి. ‘‘అది చాలా చిన్న విషయం. ముందు గుర్రం దిగు. నీ చేతిలో ఉన్న సంచిని ఎందుకు అంత జాగ్రత్తగా పట్టుకున్నావు. అందులో ఏమున్నాయి’’ అని అతనిని అడిగాడు ముల్లానసృద్దీన్. ‘‘ఈ సంచిలో చాలావిలువైన వజ్రాలున్నాయి. మీరు నాకు మనశ్శాంతిని ప్రసాదిస్తే ఆ వజ్రాలన్నీ మీకిచ్చేస్తాను’’అన్నాడు ఆ వ్యాపారి ముల్లానసృద్దీన్‌తో. వెంటనే ముల్లానసృద్దీన్ అని చేతిలోఉన్న వజ్రాల సంచిని గుంజుకుని పరుగెత్తాడు. ఒక్కక్షణం ఆశ్చర్యానికి గురైన ఆ వ్యాపారి వెంటనే ‘‘దొంగ, దొంగ...పారిపోతున్నాడు... పట్టుకోండి’’అని అరుస్తూ ముల్లానసృద్దీన్ వెనకాలే పరిగెడుతున్నాడు. అతని అరుపులకు పోగైన గ్రామస్థులు అతనితో ‘‘ఆయన దొంగకాదు...గొప్ప ఋషి... కంగారు పడకు. ఆయన ఎక్కడికీ పోలేదు. ఆ చెట్టుకిందనే ఉన్నారు’’ అన్నారు. ఆ మూర్ఖుడు చెప్పగా ఈ మూర్ఖుడి వెనకాలపడ్డాను... అని మనసులో అనుకుంటూ ముల్లాదగ్గరకు వచ్చాడు. వెంటనే ముల్లా ఆ వజ్రాల సంచిని అతనికి ఇచ్చి ‘‘ఇప్పుడెలా ఉంది? మనశ్శాంతిగా ఉందా?’’అన్నాడు. ‘‘అవును. చాలా మనశ్శాంతిగా ఉంది. కానీ, మీ పద్ధతి వింతగా ఉంది’’అన్నాడు ఆ వ్యాపారి. ‘‘ఇందులో వింత ఏమీ లేదు. అన్నీ మామూలులెక్కలే. నీదగ్గర ఉన్నది నీకే శాశ్వతమనుకుంటున్నావు. అందుకే అది పోయేమార్గం చూపించాను. ఇప్పుడు నీకు కొత్తగా దక్కినది ఏమీలేదు. నీ వజ్రాల సంచి నీకు దక్కింది. అంతే. ఇంతకుముందు ఆ సంచిని భయపడుతూ చాలా జాగ్రత్తగా పట్టుకున్నావు. ఇప్పుడు అదే సంచిని చాలాహాయిగా, ప్రశాంతంగా పట్టుకున్నావు. తేడా తెలిసింది కదా? ‘‘మనశ్శాంతి’’ అంటే అదే. కాబట్టి, ఎవరి గురించి పట్టించుకోకుండా, హాయిగా ఇంటికి వెళ్ళు’’అన్నాడు ముల్లానసృద్దీన్.
ఆ పసివాడి సమస్యకూడా ఇదే. ఏదో ఒక బొమ్మ కొనేందుకు తనదగ్గర ఉన్న అత్యంత విలువైన అమాయకత్వం, స్పష్టత, ధైర్యాలను పణంగా పెట్టేందుకు కూడా సిద్ధంగాఉంటాడు. ఎందుకంటే, ఆ పసివాడికి బొమ్మలు తప్ప ఈ ప్రపంచంలో వేరే ఏముంటాయి? కానీ, కావలసిన బొమ్మలన్నీ కొనుక్కున్నా కొద్దిరోజులకే అవి పాతవైపోతాయి. అప్పుడు వాటినుంచి ఆ పసివాడికి ఆనందం దక్కదు. వెంటనే తాను పోగొట్టుకున్నదేమిటో వాడికి తెలుస్తుంది. అందుకే మళ్ళీ కొత్త బొమ్మలకోసం ఏడుస్తాడు. మెరుగైన ప్రపంచంలోని కుటుంబ సభ్యులు పిల్లల నుంచి నేర్చుకుంటారు.

- ఇంకాఉంది
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.