S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంతేగా.. అంతేగా!

స్క్రీన్‌మీద విశృంఖులమవుతున్న కిస్సులపై ఎందుకో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఈ ధోరణి యువతను పెడదారి పట్టిస్తోందని సంప్రదాయవాదులంటుంటే.. మర్డర్లు, రేపుల్ని ధారాళంగా చూపిస్తే తప్పులేదుగానీ కిస్సులు చూపిస్తే యూత్ పాడైపోతారా? అంటూ లిబరల్ థింకర్లు కౌంటర్ ఇస్తున్నారు. ‘మజిలీ’లో చైతూ చేసిన లిప్‌లాక్ ఇప్పుడు సెంటర్ టాపిక్ అవుతోంది. కొత్త హీరోయిన్ దివ్యాన్షు కౌశిక్‌తో చైతూ గాఢచుంబనాన్ని గట్టిగానే చేశాడు. ప్రోమోస్‌తో బయటికొచ్చిన లిప్‌లాక్ సీన్ -వైరల్ కావడంతో చర్చ మొదలైంది. దీనిపై సమంతా ఫ్యాన్స్ అయితే -‘పెళ్లైన తరువాత సమంతా లిప్‌లాక్ చేస్తే తప్పన్నారు. మరి చైతూ చేస్తే తప్పుకాదా? హీరోయిన్లకు ఒక రూల్, హీరోలకు మరో రూల్ ఉంటుందా?’ అంటూ పాయింట్ లాగారు. చైతూ -దివ్యాన్ష్‌ల దివ్యాన్ష్ దివ్యమైన లిప్ లాక్ చర్చ అటుతిరిగి ఇటుతిరిగి సమంతా ముందుకొచ్చింది. దానికి సమంతా కూడా ఇంట్రెస్టింగ్ ఆన్సరే ఇచ్చింది. ‘నటించే సమయంలో నావరకూ కిస్సయినా, హగ్గయినా ఒక్కటే. అది జస్ట్ యాక్టింగ్. ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది నేనైనా.. చైతూ అయినా యాక్టింగ్‌లో భాగమే’ అంటూ తేల్చేసింది. తామిద్దరి మధ్య అద్భుతమైన అనుబంధముందని, ఒక యాక్టర్‌గా ఇలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు తమకు ఆ స్వేచ్ఛ ఉంటుందని అనేసింది. అయినా కిస్సులు, హగ్గులు వాళ్ల ప్రొఫెషనల్ కెరీర్. మధ్యలో నెటిజనులు దూరడమెందుకో.