S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముగ్గురు మహిళల దుర్మరణం!

గరిడేపల్లి, మార్చి 24: సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో ఆదివారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న వీరన్న భక్తులపైకి లారీ దూసుకెళ్లటంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతోహుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. చనిపోయిన వారంతా గరిడేపల్లికి చెందినవారే. శనివారం రాత్రి ముదిరాజ్ కుటుంబాలకు చెందినవారు వీరన్న దేవున్ని పెట్టుకుంటారు. గ్రామంలో రాత్రి ఊరేగింపు నిర్వహించి, స్థానిక శివాలయం, రామాలయంలోపూజలు నిర్వహించి సంప్రదాయ ప్రకారం పుట్ట బంగారం (పుట్టగా ఉన్న ఎర్రమట్టి) తీసుకొచ్చేందుకు గ్రామశివారులోకి ఊరేగింపుగా వెళ్లారు. పుట్టమట్టి తీసుకుని తిరిగి ఊరేగింపుగా వస్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. ఊహించని విధంగా మిర్యాలగూడ నుంచి కోదాడువైపుకు వెళ్తున్న లారీ ఒక్కసారిగా స్థానిక సమ్మక్క సారక్క హోటల్ వద్ద జనం మీదకు రావడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో గరిడేపల్లికి చెందిన మర్రి వెంకమ్మ (44), మర్రి ధనమ్మ (45), చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన భీమన మట్టమ్మ (37)లు అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో మట్టమ్మ శరీరం నుజ్జునుజ్జు అయ్యి మాంసం ముద్దగా రోడ్డుపై పడివుండటం ఘటన తీవ్రతకు అద్దం పడుతుంది. వీరితోపాటు నడుస్తున్న చామకూరి అనిల్, నాగమణి, శాసమ్మలకు గాయాలయ్యాయి. వీరిలో నాగమణి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు.
విషాదఛాయల్లో గరిడేపల్లి : ఐదు నిమిషాలయితే ఇంటికి చేరుకుని పండుగ చేసుకోవాల్సిన వారు ఒక్కసారిగా ప్రమాదానికి గురై చనిపోవడంతో గరిడేపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి. చనిపోయిన వారందరు గరిడేపల్లికి చెందిన వారు కావడంతో గ్రామం అంతా ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగిపోయింది. చనిపోయిన వారిలో మర్రి వెంకమ్మ, మర్రి ధనమ్మ కూలిపనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చనిపోయిన మరోవ్యక్తి మట్టమ్మ పుట్టిన గ్రామం గరిడేపల్లి కావటంతో పండుగకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది.
గరిడేపల్లిలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలను హుజుర్‌నగర్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి శానంపూడి సైదిరెడ్డి ఆదివారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలను అందించేందుకు కృషి చేస్తానన్నారు.
చిత్రం.. మృత్యువు పాలైన మహిళ