S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అన్నదాతలూ.. ఆందోళన వద్దు

గజ్వేల్, మార్చి 24: అన్నదాతలు ఆందోళన చెంది అఘాయిత్యాలకు పాల్పడవద్దని, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ములుగు ఏడీఏ అశోక్‌కుమార్‌తో కలిసి సిద్దిపేట జిల్లా వర్గల్, ములుగు మండలాల పరిదిలోని నాచారం, అనంతగిరిపల్లి, వేలూరు, అంబర్‌పేట్, తున్కికాల్సా, తున్కిబొల్లారం, వంటిమామిడి తదితర గ్రామాలలో వడగళ్ల వర్షంతో ధ్వంసమైన పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాథమిక అంచనా ప్రకారం 160 ఎకరాల్లో మొక్కజొన్న, ఆరుతడి, కూరగాయలు, వాణిజ్య పంటలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా, 1500ల ఎకరాల్లో పాక్షికంగా పంట నష్టం జరిగినట్లు తెలుస్తుందని స్పష్టం చేశారు. అయితే, సీఎం కేసీఆర్ దృష్టికి పంటనష్టం వివరాలు అందించి అన్నదాతలను ఆదుకుంటామని, సర్వే కోసం వచ్చే అధికారులకు రైతులు తాము నష్టపోయిన పంటల వివరాలు అందించాలని సూచించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న కొండపోచమ్మ ప్రాజెక్టు ఇక్కడి రైతులకు వరంగా మారనుందని, లక్షా 25వేల ఎకరాలలో సాగునీరంది బీడు భూములు సస్యశ్యామలమవుతాయని తెలిపారు. అతివృష్టి, అనావృష్టిల తో రైతులు సాగుచేసిన పంటలు నష్టపోతుండగా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవని భావిస్తున్నట్లు చెప్పారు.