S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నృత్య చూడామణి.. సజని (కళాంజలి)

డా. సజని వల్లభనేని ప్రఖ్యాత కూచిపూడి నర్తకి, గురువు, పరిశోధకురాలు, రచయిత్రి, సంపాదకురాలు. ఒకవైపు తల్లిగా, గృహిణిగా ఎన్నో వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ, మరొక వైపు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యానికి అంకితమయ్యారు. 2016లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి కూచిపూడి నృత్యంలో పిహెచ్.డి. పొందారు. అలాగే న్యాయశాస్త్రం చదివి 2008లో ఎల్. ఎల్.బి. పొందారు. ఇలా నృత్యం, న్యాయశాస్త్రం రెండూ నేర్చుకుని, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎన్నో డిగ్రీలు పొందారు. మరిన్ని గౌరవాలు పొందారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, న్యూఢిల్లీ నుండి 2017-19 సీనియర్ రీసెర్చి ఫెలోషిప్ (కూచిపూడి నృత్యంలో) చేస్తున్నారు.
డా.సజని వల్లభనేని గారి పిహెచ్.డి. పరిశోధనాంశం ‘అన్నమయ్య అలిమేలుమంగ - సిద్దేంద్రుని సత్యభామ తులనాత్మక పరిశీలన. ఎస్.ఆర్.ఎఫ్.లో పరిశోధనాంశం ‘అన్నమయ్య కీర్తనలు - కూచిపూడి ప్రదర్శనానుకూలత.
ప్రస్థానం: వీరు జూన్ 22, 1966లో జన్మించారు. చిన్నప్పటి నుండి మహంకాళి మోహన్, డా.సేతురాం, డా.అలేఖ్య, పద్మశ్రీ నటరాజ రామకృష్ణ, వెంపటి చినసత్యం, శోభానాయుడు వంటి ఎంతోమంది గొప్ప గురువుల వద్ద నృత్యం నేర్చుకున్నారు. నేడు శ్రీకీర్తి నృత్య అకాడెమీ డైరెక్టర్‌గా -1994 నుండి ఉత్తమ కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. వీరి శిష్యులు, ప్రశిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
అభిరుచులు: వీణ, సంగీతం, తోటపని ఎంతో ఇష్టం.
యు.ఎస్.ఏ. పదమూడు సార్లు వెళ్లి వందల ప్రదర్శనలు ఇచ్చారు. పారిస్, దుబాయ్ తదితర ప్రాంతాలలోనూ ప్రదర్శనలు ఇచ్చారు. అమెరికాలో హిందూ ఆలయం, ఇండియానా పోలీస్, డెట్రాయిట్, చికాగో, సెయింట్ లూయిస్, రాచెస్టర్ వంటి ఎన్నో నగరాల్లో లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్స్ ఇచ్చారు. సంగీతం, సాహిత్యం, గతిభేదాలు, సందర్భంగా కథావివరణ చేస్తూ అందరి మన్ననలు పొందారు.
కళాకారిణిగా: సంగీతం, సాహిత్యం, నృత్యం.. ద్వారా మనస్సు - ఆత్మ ఉన్నతిని పొందడంలో సార్థకత పొందాను అంటారీమె.
గౌరవాలు: నృత్య చూడామణి - 1987లో నేషనల్ స్కాలర్‌షిప్.
సర్ట్ఫికెట్ - ఆంధ్రనాట్యం
మెరిట్ సర్ట్ఫికెట్ - నవభారత్ ఆర్ట్ థియేటర్స్.
1999లో గోల్డ్‌స్టార్ ఆర్గనైజేషన్ నవరత్న పురస్కారం.
నవ్యనాటక సమితి కన్వీనర్ - ఒక్లహామా మేయర్ చేతుల మీదుగా ఘన సన్మానం.
2010లో సిలికానాంధ్ర వారి ఆహ్వానంపై సెమినార్లు.
2010లో లక్ష గళార్చన - గిన్నీస్ వరల్డ్ రికార్డ్.
రచయిత్రిగా: ఎన్నో వ్యాసాలను ఐఎస్‌బిఎన్ గుర్తింపు ఉన్న జర్నల్స్, సావనీర్లలో ప్రచురించారు.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి