S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (7-4-2019 నుంచి 13-4-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తారు. శారీరక మానసికమైన సంతోషాలుంటాయి. అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటారు. బాధ్యతలను ఆనందంగా నిర్వర్తిస్తారు. అనేక రూపాల్లో ప్రయోజనాలుంటాయి. ప్రభుత్వాలకు, ఇతర ప్రదేశాలకు చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో కుటుంబంపై దృష్టి కేంద్రీకరిస్తారు. అనుబంధాలు సంతోషాన్నిస్తాయి. బంధుమిత్రులతో గడుపుతారు. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం. మాట తీరులో తొందరపాటు కూడదు. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఇతరులకు సహకరించడం వల్ల మేలు కలుగుతుంది. గౌరవ లోపాలు రాకుండా కొంత జాగ్రత్త అవసరం. సోదరవర్గ వ్యవహారాలు ఒక కొలిక్కి రాక తికమక పడతారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులపై దృష్టి. ప్రయాణాలకు అవకాశం. పరామర్శలుంటాయి. సౌఖ్యం కోసం ప్రయత్నం. విశ్రాంతి ఆశించినంతగా లభించకపోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఉన్నా గుర్తింపు, గౌరవాదులు లభిస్తాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. కొన్ని లాభాలు సంతోషాన్నిస్తాయి. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసంతో మెలిగే అవకాశం. కొత్త పనులు, కొత్త బాధ్యతలుంటాయి. శ్రమ ఉన్నా సంతోషంగా గడుపుతారు. అనేక కార్యక్రమాల్లో నిమగ్నవౌతారు. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. సంప్రదింపులుంటాయి. వారాంతంలో కుటుంబంలో సంతోషం. బంధుమిత్రుల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనం పెంచుకునే ప్రయత్నం. ఆర్థిక వ్యవహారాల్లో మంచి నిర్ణయాలుంటాయి. మాట తీరులో మంచి మార్పులున్నా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలున్నా శ్రమ తప్పదు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కార్యనిర్వహణలో సంతృప్తి. కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉన్నతమైన వ్యవహారాలను నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు, విహార యాత్రలకు అవకాశం అధికం. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. అధికారుల ఆదరణ. వారం మధ్యలో ఖర్చులు పెట్టుబడులుంటాయి. కొంత అధికం కాకుండా చూసుకోవాలి. తొందరపాటు కూడదు. ఆశించిన విశ్రాంతి లభించక పోవచ్చు. కాలం, ధనం కోల్పోయే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యాలకు అవకాశం ఉంది. వారాంతంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. అనేక బాధ్యతలను నిర్వహించే ప్రయత్నం చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో వృత్తి, ఉద్యోగాదుల్లో మంచి మార్పులకు అవకాశం. పదోన్నతులుంటాయి. సామాజిక గౌరవం పెంచుకుంటారు. అధికారుల ఆదరణ ఉంటుంది. పితృవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఆహార విహారాల్లో అనుకూలత. కొన్ని అనుకోని ఇబ్బందులకు అవకాశం. తొందరపాటు కూడదు. వారం మధ్యమంలో అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. పెద్దల ఆశీస్సుల కోసం యత్నిస్తారు. ఆశించిన లాభాలు అందక ఇబ్బంది పడతారు. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. సంతాన విషయంలో నూతన నిర్ణయాదులు తీసుకుంటారు. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు పెరుగుతాయి. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. పోటీ రంగంలో ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. సుదూర ప్రయాణాలపై దృష్టి. దైవ ధర్మ కార్యాలలో పాల్గొంటారు. వైజ్ఞానిక పరిశోధనలకు మేలు. న్యాయ వ్యవహారాలు చర్చకు వస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. భాగస్వామ్యాల్లో అనుకూలత ఉంటుంది. నిర్ణయాదులు ఇబ్బంది పెట్టవచ్చు. అధికారులతో జాగ్రత్త. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారుల ఆదరణ. గుర్తింపు లభించినా అనవసరమైన తొందరపాటు ఉంటుంది. ఖర్చులు పెట్టుబడులుంటాయి. సామాజిక వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వారాంతంలో ప్రయోజనాలపై దృష్టి. అధికమైన లాభాలు ఆశించి భంగపడే అవకాశం. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. సంతాన వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకోని సమస్యలు, అనారోగ్య భావనలు ఇబ్బంది పెడతాయి. కుటుంబంలోనూ జాగ్రత్తగా మెలగాలి. పోటీ రంగంలో కొంత శుభ పరిణామం. భాగస్వామ్యాల్లోనూ ఒత్తిడులు తప్పకపోవచ్చు. వారం మధ్యమంలో అన్ని కార్యక్రమాలకు అనుకూలం. నూతన వ్యవహారాలుంటాయి. లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత. సుదూర ప్రయాణాలపై దృష్టి. విద్య, వైజ్ఞానిక, న్యాయ వ్యవహారాలను పరిశీలిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకునే ప్రయత్నం చేసినా ఆశించినంతగా అందకపోవచ్చు. వారాంతంలో అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. అతి ప్రయోజనాలను ఆశిస్తే భంగం తప్పదు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలకు అనుకూలం. పరిచయాలు పెంచుకుంటారు. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శ్రమతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొత్త పనులపై దృష్టి సారిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతోషంగా గడుపుతారు. వ్యతిరేకతలపై విజయం. పోటీ రంగంలో గుర్తింపు, శ్రమ. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు, అనారోగ్య భావనలుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. ప్రమాదాలకు అవకాశం ఉంది. అప్రమత్తంగా మెలగాలి. కుటుంబ, ఆర్థికాంశాల్లో ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. వారాంతంలో ఉన్నత వ్యవహారాలుంటాయి. సుదూర ప్రయాణాదులపై దృష్టి. విద్యారంగంలో అభివృద్ధి. అసంతృప్తి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలుంటాయి. అధిగమించాలి. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. శ్రామికులకు శ్రమ అధికవౌతుంది. అయినా ఫలితాలను సాధిస్తారు. ఖర్చులు కూడా అధికంగా చేసే అవకాశం. ప్రయాణాదులుంటాయి. ఆహార విహారాలపై దృష్టి. ఆలోచనల్లో కొంత ఒత్తిడి. అధికారిక కార్యక్రమాలపై దృష్టి. వారం మధ్యమంలో బంధుమిత్రులతో ఆనందంగా గడిపే ప్రయత్నం. భాగస్వామ్యాల్లో కొంత ఇబ్బందులకు అవకాశం. తొందరపాటు కూడదు. నిర్ణయాదుల్లో అప్రమత్తంగా మెలగాలి. పరిచయాలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం. వారాంతంలో అనుకోని ఇబ్బందులుంటాయి. అనారోగ్యం. వ్యర్థమైన ఆలోచనలకు, ప్రయాణాలకు అవకాశం ఉంది. శ్రమ అధికవౌతుంది. ముఖ్య వ్యవహారాలను వాయిదా వేసుకోవడం శ్రేష్ఠం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత. సంతాన వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలుంటాయి. ప్రణాళికలను సిద్ధం చేస్తారు. వ్యవహార విజయం. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. సంప్రదింపులుంటాయి. స్ర్తివర్గ సహకారం లభిస్తుంది. ఆహార విహారాల్లో జాగ్రత్త. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వారం మధ్యమంలో వ్యతిరేకతలు అధికం. పోటీల్లో విజయం సాధిస్తారు. శ్రమ అత్యధికం. అయినా గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు శ్రమతో ఫలిస్తాయి. రుణ రోగాదులను అధిగమిస్తారు. కార్యినిర్వహణ దక్షత పెరుగుతుంది. ఖర్చులు పెట్టుబడులు కూడా అధికం. విశ్రాంతి లోపం. వారాంతంలో భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు స్నేహానుబంధాల్లో అప్రమత్తంగా మెలగాలి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార సౌఖ్యం ప్రభావితం చేస్తుంది. శారీరక సౌఖ్యాదులు, సౌకర్యాదులపై దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రయాణాదులకు అవకాశం. గృహ వాహనాదులపై దృష్టి. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. శ్రమ అత్యధికంగా ఉంటుంది. కుటుంబంలో అనుకూల ప్రభావాలుంటాయి. అధికారుల సహకారం లభిస్తుంది. వారం మధ్యమంలో ఆలోచనలు ఫలించే అవకాశం. నిర్ణయాదుల్లో కొంత తొందరపాటు ఉండే సూచనలు. సంతాన వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. సృజనాత్మకత పెంచుకుంటారు. ప్లానింగ్ ఫలిస్తుంది. లాభాలుంటాయి. సంతోషంగా వ్యవహరిస్తారు. వారాంతంలో పోటీ రంగంలో గుర్తింపు. రుణ రోగాదులపై విజయం. వ్యతిరేకతలను అధిగమిస్తారు.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులుంటాయి. అందరి సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం కూడా చేస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. స్ర్తివర్గ సహకారం లభిస్తుంది. బాధ్యతలను సంతోషంగా నిర్వహిస్తారు. కుటుంబంలో కొంత ఒత్తిడి వాతావరణం కనిపిస్తుంది. మాటల్లో అధికారిక ధోరణి. వారం మధ్యమంలో ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. గృహ వాహనాది సౌకర్యాలను పెంచుకునే ఆలోచనలుంటాయి. శ్రమ ఉన్నా సంతోషం ఉంటుంది. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులకు సంబంధించిన చర్చలుంటాయి. శారీరక ఒత్తిడులను జాగ్రత్తగా అధిగమించాల్సి ఉంటుంది. వారాంతంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మక శక్తితో గడుపుతారు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలను పెంచుకునే సూచనలున్నాయి. మాట తీరువల్ల ఎన్నో కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఎందరో మిత్రులయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని అనుకోని సమస్యలకు కూడా అవకాశం ఉంది. విహారాలకు విందులకు ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, సౌఖ్యం కోసం వెచ్చించాల్సి వస్తుంది. నిర్ణయాదుల్లో ఒత్తిడులుంటాయి. శారీరక శ్రమ అధికవౌతుంది. వారం మధ్యమంలో సంప్రదింపులుంటాయి. అన్ని అంశాల్లోనూ అనుకూలత. వార్తలు కొత్తగా విన్నప్పటికీ కొంత జాగ్రత్త అవసరం. సుదూర లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తి ప్రతిష్ఠలను పెంచుకుంటారు. వారాంతంలో సౌకర్యాదులపై దృష్టి. ఆహార విహారాల వల్ల సంతోషం.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ