S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గృహ ప్రవేశం

మార్కెట్‌కి వెళ్లేటప్పుడు
చేతిసంచీ; మనీ పర్సుతోపాటు
పెన్నూ, కాగితం కూడా
నీతో తీసుకెళ్లు
బజారు ఎవరైనా చెయ్యొచ్చు
ఏ సరుకునైనా
కవిత్వం చేయగల
సత్తా వున్న నువ్వు కూడా
మామూలుగా వెళ్తే ఎలా?
పాల కోసం
పసిపిల్ల
తల్లి స్తన్యం తడిమినట్టు
జడిలో తడిసిన
పిల్లపక్షికి
రెక్కల రక్షణనిచ్చి అక్కున చేర్చుకునే తల్లి పక్షిలా
ఊరిని కాచే
ఏటిగట్టులా
తెల్లార్లూ-
మేల్కొనే దేశ సైనికుడిలా-
నదులన్నిటితోనూ
సాదరంగా చేయి కలుపుతూ
సఖ్యతతో మనుగడించే
సాగరం లాంటి వాడివి కదా!
అన్నిటినీ మించి
విరిగి నలిగిన
హృదయపరుడివి కదా నువ్వు!
పుంఖాలు పుంఖాలుగా
పుట్టుకొచ్చే
ఉత్తేజకర కొత్త ఆలోచనల్ని
చెల్లాచెదరవకుండా
నిక్షిప్తపరచాలంటే
చేతిలో పనిముట్లుండాలి కదా!
బజారుకనే కాదు
ఇకపై
బయటకెక్కడికెళ్లినా
నీ ఆయుధాలతో నువ్వెళ్లాల్సిందే-
వాడితే ఖర్చయిపోయే
సరుకులతోనే కాదు
నిల్వయ్యే కొద్దీ
జనం నాలుకల మీద నాట్యమాడే
పసగల కొత్త కవితలతో
లో గడప దాటుతూ-
ఏరోజుకారోజు గృహప్రవేశం చెయ్!
కంటపడ్డ వస్తువునెల్లా కవిత్వం చెయ్!
*

-మోకా రత్నరాజు 9989014767