S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మరణించిన తరువాత..(సండేగీత)

మనిషి ఇష్టపడని విషయం మరణం. కానీ తప్పదు. అది ఎంత విషాదమైనా, ఇష్టం లేనిదైనా మరణం తప్పదు.
చాలామందికి ఓ వ్యక్తి మీద కోపం, ద్వేషం ఉంటుంది. అలా వుండటానికి తగు కారణాలు వుంటే వుండవచ్చు. కానీ ఆ వ్యక్తి దగ్గరి బంధువైనా, ఆ కోపం వున్న వ్యక్తి అతన్ని క్షమించడు. రక్త సంబంధీకులని కూడా ఈ విధంగా చూస్తూ వుంటాం. మరణించిన తరువాత క్షమిస్తారు. దుఃఖిస్తారు.
అందుకే ఓ కవితలో ఇలా అంటాను.
ఏముంటుందీ
ఒక మరణం తరువాత
కాస్త బూడిద, కాసిన్ని అస్తికలు
కొంత బాధ, మరి కొన్ని కన్నీళ్లు..
... ....
మరణం తరువాత
తెలిసిన విషయం ఒక్కటే
ఒక విషయాన్ని అంగీకరించడం వెనక
ఎంత ఘర్షణ ఉంటుందోనన్న విషయం
ఒక జీవితాన్ని చూసి
ఎంత నేర్చుకోవచ్చో
ఒక మరణాన్ని చూసి
అంతకన్నా
ఎక్కువ నేర్చుకోవచ్చన్న విషయం.
ఇలాంటిది కాకుండా మరో పద్ధతి కూడా వుంటుంది.
మరణం తరువాత మన వారసత్వం కొనసాగాలి. పిల్లలు, మనుమలు, మనుమరాళ్లు కాదు. అది సరే!
ఏదో ఓ రంగంలో మన ముద్ర వుండాలి. ఆ ముద్ర కొనసాగాలి. విజయం కూడా మన జీవితకాలంలోనే లభించాలి. కానీ కొంతమంది విషయంలో మరణించిన తరువాత విజయం లభిస్తుంది. అది కొంత బాధ కలిగించే విషయమే అయినా ఎలాంటి ముద్ర లేకుండా మరణించడం అత్యంత విషాదం.
మరి మన ముద్ర ఈ ప్రపంచం మీద వుండాలి.
మరి మన ప్రయత్నం వుండాలా.. వద్దా?
*

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001