S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చెత్త లాండ్రీ

ఈ మధ్య ప్రముఖ రచయిత పాల్ కొహెలో రాసిన ఓ చిన్న కథని అతని బ్లాగులో చదివాను. అది నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది.
ఓ కొత్త జంట కొత్త అపార్ట్‌మెంట్‌లో చేరారు. వాళ్ల డైనింగ్ హాల్ దగ్గర నుంచి ప్రక్కన వున్న ఫ్లాట్ వాళ్ల వాషింగ్ ఏరియా కన్పిస్తుంది.
ఓ రోజు ఉదయం ప్రక్కింటి అమ్మాయి బట్టలు ఉతికి ఆరేస్తూ కన్పిస్తుంది. ఈ జంట బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ వుంటారు.
‘ఆ బట్టలని సరిగ్గా ఉతకడం లేదు. ఆమెకు మంచి సబ్బు కావాలేమో’ అంది భార్య భర్తతో.
భర్త ఏమీ మాట్లాడలేదు. వౌనంగా టిఫిన్ తిన్నాడు.
ప్రక్కింటి అమ్మాయి బట్టలని ఆరేస్తూ కన్పించినప్పుడల్లా ఆమె భర్తతో ఇదే మాట అనేది. అతను అలాగే వౌనంగా వుండేవాడు.
ఓ నెల రోజుల తరువాత ఆమె ఆశ్చర్యపోయింది. బట్టలు చాలా పరిశుభ్రంగా తెల్లగా కన్పించాయి. ఆమె వెంటనే భర్తతో ఇలా అంది.
‘బట్టలని శుభ్రంగా ఎలా ఉతకాలో ఆమె చివరగా తెలుసుకుంది. ఎవరు నేర్పారో ఆమెకి’
ఆమె భర్త ఇలా అన్నాడు.
‘ఈ రోజు ఉదయమే నేను లేచి మన కిటికీ అద్దాలని శుభ్రంగా తుడిచాను. అంతే!’
జీవితంలో కూడా ఇంతే!
ఎదుటి వ్యక్తులని చూస్తున్నప్పుడు మనం చూసే కిటికీలోని పరిశుభ్రతని బట్టి వాళ్లు కన్పిస్తారు.
అందుకని ఎవరినీ సులువుగా జడ్జి చేయకూడదు. జీవితం గురించిన అవగాహన మనం చూసే అద్దాని బట్టి వుంటుంది.
మన అద్దం కోపంతో, ఈర్ష్యతో, వ్యతిరేక భావనలతో, తీరని కోర్కెలతో వున్నప్పుడు మనకు కన్పించే దృశ్యం మరోలా వుంటుంది.
చెత్త లాండ్రీ కథతో మన అద్దాలు మారతాయా?

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001