S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నివాళి సవాల్

కన్నతల్లికే కాదు-
మాతృభూమికే గర్భశోకమిది
కాలం కసిబూనిందో
కాలయముని బుద్ధి వక్రించిందో
కసాయి గుండెల - కర్కశత్వం
కనె్నర్రజేసి - కయ్యానికి కాలుదువ్వింది
ఎదిరి పోరలేక - బెదిరి పారిపోలేక
వెన్నుపోటుకు శ్రీకారం చుట్టింది
ఉన్మాద చర్యతో ఉసిగొలిపింది
పరమత సహనం పరమధర్మమని
అహింసయే మన సిద్ధాంతమని
ఎలుగెత్తి చాటిన మనపై
ఉగ్రవాదం - ఉక్కుపాదం మోపుతోంది
తీవ్రవాదం - తీగలాగి డొంక కదుపుతోంది!
దేశమంటే మట్టికాదని
దేశమంటే మనుషులేనని
ఆవేశంగా పల్లటించిన - నేలలో
గురజాడే - మన అడుగుజాడ కావాలి.
అమానుషంగా అనంత వాయువుల్లో
కలిసిపోయిన మన వీర జవాన్లకు-
అశ్రునివాళి అర్పిద్దాం - సమరభేరి మోగిద్దాం!!
ఉగ్రవాదుల ఆట కట్టిద్దాం - తీవ్రవాదాన్ని అరికడదాం!
*

-మరువాడ భానుమూర్తి