S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విద్యార్థి జీవితంలో క్రీడలు, కళలు

మీరు గనుక విద్యారంగం వైపు చూసినట్లయితే అన్ని పాఠశాలలు కూడా పిల్లలకు అన్ని విధాల చదువు (ఆల్ రౌండ్ ఎడ్యుకేషన్) ను అందిస్తున్నట్లుగా చెబుతుం టాయి. క్రీడలు, కళలను కూడా కరిక్యులమ్ లో భాగంగా చేస్తాయి మరియు ప్రతి విద్యార్థి కూడా కనీసం ఒక క్రీడ మరియు ఒక కళలో పాల్గొనేలా చేస్తాయి.
అకడమిక్ పై మాత్రమే శ్రద్ధ వహించకుండా అన్ని విధాలైన చదువు దిశగా ఎందుకు ఆకస్మిక మార్పు చోటు చేసుకుందా అని ఎప్పుడైనా ఆలోచించారా.... మన చుట్టూ ఉన్న ప్రపంచం మన ఊహలను మించిన వేగంతో మారి పోతున్నది. మన ముందు అనిశ్చిత భవిష్యత్తు ఉంది. కొనే్నళ్ళ క్రితం మనుషులు చేసిన ఉద్యోగాలను ఇప్పుడు యంత్రాలు చేస్తున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఉద్యోగాలు కొనే్నళ్ళ క్రితం మనుగడలో లేవు. ఇలాంటి పరి స్థితుల్లో మన పిల్లలను బలోపేతం చేసేది ఏమిటంటే మైండ్ మరియు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ హాబిట్స్ ను వృద్ధి చేసుకోవడమే. ఆటలు, కళలు అందించేది ఈ అంశానే్న. కనీసం ఒక్క ఆట అయినా నేర్చుకోవాల్సిన అవసరంపై ఈ వ్యాసంలో చర్చించుకుందాం.
ఆటలు శారీరక సామర్థ్యాన్నీ, నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు, నిర్వహించుకునేందుకు వీలు కల్పించడమే గాకుండా కాలం గడుస్తున్న కొద్దీ పిల్లల్లో ఎనె్నన్నో లక్షణాలను వృద్ధి చేస్తాయి. జీవితంలో ఎంతో కాలంపాటు కొనసాగే కొన్ని ముఖ్యమైన అంశాలు:
1. ఫిజికల్ ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చడం: పిల్లలు ఏదేని ఆటలో చిన్న వయస్సు నుంచే పాల్గొనడం అందించే ముఖ్యమైన ప్రయోజనం ఫిజికల్ ఫిట్‌నెస్. ఆటలతో పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకదానిలో హడావుడిగా ఉంటారు. శక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటారు. దీంతో వారు నెమ్మదిగా ఫిట్‌నెస్‌ను కూడా పెంచుకో గలుగుతారు.
2.జీవన నైపుణ్యాలు నేర్పడం: ఆటలు ఫిజికల్ ఫిట్ నెస్ కు తోడ్పడడం మాత్రమే గాకుండా అవి పిల్లలకు అతి ముఖ్యమైన జీవన నైపుణ్యాలను కూడా అలవరుస్తాయి. తోటివారితో, పెద్దలతో, కోచ్‌లతో, తమ సీనియర్లతో వివిధ రకాల సామాజిక స్థితిగతుల్లో ఎలా వ్యవహరించాలో చిన్నతనంలోనే తెలియజేస్తుంది. తమను తాము మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు ఆటలు తోడ్పడుతాయి.
3. టైమ్ మేనేజ్‌మెంట్: చాలా క్రీడలు నిర్దిష్ట కాల వ్యవధితో ఉంటాయి. వాటిని ఫీల్డ్ లో ఆడాల్సి ఉంటుంది. తమ జట్టు గెలుపొందేందుకు కాలు చురుగ్గా కదపాల్సి ఉంటుంది. టైమ్ మేనేజ్‌మెంట్ అనే అత్యంత ముఖ్యమైన జీవన నైపుణ్యాన్ని ఇది నేర్పిస్తుంది.
4. క్రమశిక్షణ: జీవితంలో క్రమశిక్షణ మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. ఒక ఆటలో రాణించడం అంటే విద్యార్థి దాన్ని నిరంతరం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో అలవాటయ్యే క్రమశిక్షణ కాలం గడుస్తున్న కొద్దీ మరింతగా మెరుగుపడుతుంది.
5. నాయకత్వ నైపుణ్యాలు: ఒక జట్టుగా ఆడాల్సిన ఆటలో పిల్లలకు వివిధ బాధ్యతలు అప్పగించబడుతాయి. గెలిచేందుకు గాను వారు జట్టు తరఫున ఆలోచిస్తూ సమగ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే శక్తిని మరియు నాయకత్వ నైపుణ్యాలను అంది అందిస్తుంది. ప్రతి చిన్నారి కూడా తమదైన మార్గంలో ఒక లీడర్ గా ఉంటారు మరియు వారు చేసేదంతా కూడా గెలిచేందుకో లేదా ఓడిపోయేందుకో దారి తీస్తుంది. ఒక చిన్నారి గనుక ఒక జట్టుకు కెప్టెన్ గా ఉంటూ నాయకత్వం వహిస్తే ఆ చిన్నారి ప్రతి మనిషిని కూడా వారి బలాలు మరియు బలహీనతలతో ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోగలుగుతాడు.
6. టీమ్ స్పిరిట్ మరియు క్రీడాస్ఫూర్తి: అన్నిటి కంటే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సింది జట్టుకే అనే విషయాన్ని టీమ్ స్పిరిట్ నేర్పిస్తుంది. స్వీయ ప్రయోజనం అనేది ఎప్పటికీ రెండో స్థానంలోనే ఉండాలి. మీకు ఇష్టం ఉన్నా లేదా లేకపోయినా..... జట్టులోని విభిన్న రకాల వారితో ఎలా సర్దుకుపోవాలో విద్యార్థి నేర్చుకోగలుగుతాడు. భవిష్యత్‌లో అది పిల్లలకు వారు వివిధ రకాల వ్యక్తులతో కలసి పని చేయడంలో తోడ్పడుతుంది.
7. ఆత్మవిశ్వాసం పెంపుదల: చిన్నారి ఒక పని చేసి నప్పుడు లేదా మెరుగైన పనితీరును కనబర్చినప్పుడు అది ఆత్మవిశ్వాసాన్ని అధికం చేస్తుంది. కఠోర పరిశ్రమ మరియు నిలకడగా అభివృద్ధి సాధించడం నేర్పిస్తుంది.
8. ఓటమిని కూడా అంగీకరించగలగడం: ప్రతి ఆటలో కూడా గెలవడం మరియు ఓడడం అనేది ఓ భాగం. మనం గెలిచేందుకు ఇష్టపడుతుంటాం. అందుకోసమే బాగా ప్రయత్నిస్తుంటాం. అయినప్పటికీ ఫలితం ఆమోదించడం అనేది ఓ చిన్నారి నేర్చుకోగలిగిన అత్యుత్తమ పాఠం.
9. మానసిక శక్తిని అందిస్తుంది: అలసిపోయినా లేదా గాయపడినా కూడా అడుగు ముందుకే వేసే అలవాటును ఆటలు మాత్రమే అందించగలుగుతాయి. ఈ విధమైన మానసిక శక్తి పిల్లలు తాము ఊహించని ఎత్తులకు చేరుకునే అవకాశాన్ని అందిస్తుంది.
10. నిర్ణయాలు తీసుకునే శక్తి: ఆటలో ప్రతి నిమిషం కూడా పిల్లలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంతిని ఎడమ లేదా కుడి వైపు పాస్ చేయడం, వ్యూహం మార్చుకోవడం లాంటివి ఉంటాయి. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక ఆటగాడికి ఆటోమేటిక్ గానే వస్తుంటుంది.
ఆటలు ఆడడం ఆయా వ్యక్తులకు మాత్రమే గాకుండా మొత్తం మీద సమాజానికి కూడా ప్రయోజనం కలిగి స్తుంది. సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు కలిగిన వివిధ వర్గాలు ఏకతాటిపైకి వచ్చేందుకు ఆటలు వీలు కల్పిస్తాయి. నేరాలు, అసాంఘిక ధోరణులను తగ్గిస్తాయి.
ఒక పాఠశాలలో ఆల్‌రౌండ్ ఎడ్యుకేషన్ ను అందిస్తున్నామంటే అది ఈ విషయంలో ఎంతో అధ్యయనం చేసి ఉంటుందని, మీ చిన్నారికి విలువలు నేర్పించేందుకు, జీవన నైపుణ్యాలను అందించేందుకు అది తోడ్పడుతుందని మీరు గుర్తించగలుగుతారు. పాఠ్యాంశాల వైపు పరుగులు తీయడం మాత్రమే గాకుండా అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది.

లీనా అస్హర్ (కంగారూ కిడ్స్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ వ్యవస్థాపకులు)