S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సగం మేరకే!

మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. స్క్రీనింగ్ పరీక్ష రాసేందుకు జిల్లాలో 30వేల 523 మంది దరఖాస్తు చేసుకోగా 15వేల 617 మంది మాత్రమే హాజరవ్వగా 14వేల 906 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 51.16 శాతం మాత్రమే నమోదైంది. సగానికి సగం మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరు కావడం విశేషం. జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష రాసేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చలేదన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 516 క్లస్టర్లలో కేవలం 20 కార్యదర్శుల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విషయంలో అభ్యర్థుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. 30వేల 523 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్ష రాసేందుకు మాత్రం సగానికి సగం మంది ఆసక్తి కనబర్చకపోవటం విశేషం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల కోసం మంచినీటి వసతితో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రాథమిక చికిత్సా శిబిరాలు ఏర్పాటు చేశారు. కానీ అభ్యర్థులు ఆ స్థాయిలో రాకపోవటంతో కొంత అధికారులు కూడా నిరుత్సాహ పడ్డారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12.30ని.లకు ముగిసింది. ఆయా మండల తహశీల్దార్లు వారి పరిధిలో ఉన్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. మచిలీపట్నంలోని పరీక్షా కేంద్రాలను జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, రెవెన్యూ డివిజనల్ అధికారి జె ఉదయ భాస్కర్ తనిఖీ చేశారు.