S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుణదలమాత పుణ్యక్షేత్రంలో అంబర్నాంటిన పాస్కా సంబరాలు

పటమట, ఏప్రిల్ 21: మృత్యుంజయుడైన క్రీస్తును స్వాగతిస్తూ గుణదలమాత పుణ్యక్షేత్రంలో ఆదివారం పా స్కా(ఈస్టర్) సంబరాలు అంబర్నాంటాయి. పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ యే లేటి విలియం జయరాజు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ పసల తోమస్, బిషప్ గ్రాసి హైస్కూల్ కరస్పాడెంట్ ఫాదర్ ఇంటి అంతోని, పుణ్యక్షేత్ర సహాయ గురువులు ఫాద ర్స్ కొండ మహేష్, కొలకాని జయపా ల్ రాయ్, టీ రవికుమార్ ఈస్టర్ ‘స మష్టి దివ్యపూజాబలి’ సమర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఫాదర్ పసల తోమస్ భక్తులకు సందేశమిస్తూ క్రీస్తు భగవానుడు మానవులకి రక్షకుడిగా, సేవకుడిగా మానవరూపంలో ఈలోకానికి వచ్చారని తెలిపారు .క్రీస్తు మానవ రక్షణకే సిలువ త్యాగం పొందారన్నా రు. తొలుత పుణ్యక్షేత్రం రెక్టర్ యేలేటి విలియం జయరాజు తదితర గురువు లు పాస్కా కొవ్వొత్తిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. వివిధ ప్రాం తాల నుండి ఈస్టర్ వేడుకలు తిలకించటానికి రావటంతో పుణ్యక్షేత్ర ప్రాంగ ణం భక్తులతో కిటకిటలాడింది. పుణ్యక్షేత్ర విచారణ సంఘపెద్దలు తోట మో జేస్. కోసనం డేవిడ్, సుద్దునూరి విజ య్, గుమ్మడి రవి, ప్రతినిధి కోనాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.