S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వెనక్కి..(సండేగీత)

మనం ఏదన్నా పని చేద్దామని అనుకునేంతలో ఎన్నో అవాంతరాలు వస్తాయి. కొన్ని సహజంగా వచ్చేవి. మరి కొన్ని ఇతరులు సృష్టించేవి.
ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దామని అనుకుంటే, అందులోని లోటుపాట్లు చాలా మంది చెబుతారు. అంతవరకు పర్వాలేదు. కానీ నిరుత్సాహ పరచకూడదు. ఆ పని ఎక్కువమంది చేస్తూ ఉంటారు.
ప్రతి పనిలోనూ రిస్క్ ఉంటుంది. ప్రమాదం అంచునే జీవితం ఉంటుంది.
జీవితం ఓ గాజు పాత్ర లాంటిది. కొంచెం అజాగ్రత్తగా ఎవరు ప్రవర్తించినా అది పగిలిపోతుంది.
వాకింగ్ కాకుండా, రన్నింగ్ చేసినప్పుడు ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. దాన్ని ఉదాహరణగా తీసుకొని రన్నింగ్ మానేస్తామా?
అలా చేస్తే ఏమైనా ఉపయోగమా?
ఎవరో వివాహం చేసుకున్న నెలరోజులకే విడాకులు తీసుకున్నారు. అట్లా అని వివాహాలు చేసుకోవడం మానేస్తామా?
అమెరికాలో తుపాకులు విచ్చలవిడిగా వాడతారు. చాలామంది చనిపోతున్నారు తుపాకుల కాల్పుల్లో...
నిజమే.
అమెరికా వెళ్లడం మానేస్తామా?
శ్రీలంకలో బాంబుల దాడి జరిగి తెలుగు వాళ్లు చనిపోయారు.
అట్లా అని విహార యాత్రలు మానేస్తామా?
ప్రమాదం లేనిది ఎక్కడ?
అనుకోకుండా గాలి వీచి, ఎల్.బి. స్టేడియమ్‌లో టవర్ కూలి ఓ వ్యక్తి మరణించాడు.
మనం ఏ పని చేద్దామని అనుకున్నా ఏదో ఓ కథ చెప్పి, వివరణ చెప్పి మనల్ని వెనక్కి లాగే వాళ్లు ఎక్కువగా ఉంటారు.
జాగ్రత్త అవసరమే!
అలా చెప్పేవాళ్లు మనలని విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తున్నారా?
మనల్ని మన జీవితం గడపకుండా వెనక్కి లాగుతున్నారా?

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001