S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలుగోడి గోల

ఏమిటా గోల
ఏముందీ తెలుగోడి గోల
తెలుగులో మాట్లాడితే చిన్నతనం
ఇంగ్లీషులో ఇకిలిస్తే పెద్దతనం
మనకెందుకులే అనుకోవడం సోమరితనం
నిన్నూ నీ భాషను ఉద్ధరించుకోవడం మగతనం
ఈనాడు ఎవడిక్కావాలి ఇతిహాసం
సినిమాలూ, టీవీలతోనే మందహాసం
చాదస్తాన్నీ ఛందస్సునూ వదలి
వచనాల్లో వర్ణించడం, వల్లించడం
అందరికీ సులభంగా జీర్ణించడం
ఇదే అందరినీ ఆకర్షించడం
ఆనందంగా ఆహ్వానించతగ్గ విషయమే!
తేలిక తేలిక అంటూ తెలుగు పీలికలను
ఇంగ్లీషు పీచులతో నాలుకపై ఆడించడం
అలవాటై పోయి, పాండిత్యాన్ని పరిహసించడం
అదేదో పాచి పదార్థమై పోయినట్లుగా
అసలు పట్టించుకోక పోవడం దారుణం
ఈ వింత ధోరణిలో ఈ ధరణిలో
తిరిగి తెలుగు భాషా వైభవము సంభవమా!
ప్రాచీన భాషా హోదాలతో
ప్రపంచ తెలుగు మహాసభలతో
సంతృప్తి చెంది సర్దుకుపోదామా!
ఏమిటో తెలుగోడి గోల
ఎవరికీ అంతుబట్టని లీల

-షణ్ముఖశ్రీ.. 8897853339