S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎన్నాళ్ళీ బలిదానాలు?

ఓ భరతమాతా! ఓ దివ్యచరితా!
రక్త్ధారలో నీ వొడి నుండి జారిపోతున్నారమ్మా
దేశ రక్షణా యజ్ఞంలో ఆజ్యమవుతున్నారమ్మా
వసివాడని పసిబిడ్డల నొదలి
పడతుల సిందూరం తుడిచి
ముదుసలి జననీ జనకుల నొదలి
ముద్దులొలికే చెల్లెళ్ల నొదలి
నాన్నకు ననె్నప్పుడు చూపిస్తుందా..
అని తహతహలాడే గర్భస్థ శిశువల నొదలి
జారిపోతున్నారమ్మా
నీ వొడి నుండి జారిపోతున్నారు

శీతల గదుల వెచ్చని రుచులు చవిచూసే
బడాబాబుల సుఖాల కోసం
హద్దులు మీరి భోగాలను మరిగే
భామల కౌగిళ్లలోని కామాంధుల కోసం
వావి వరసలు మరచి మాంసమథనం చేసే
మానవ మృగాల వికృత క్రీడల కోసం
అవినీతిని చట్టబద్ధం చేసి
పదవీ విరమణ చేసే లంచగొండుల రాజ్యం కోసం
జాతులు మతాలు కులాల మధ్య చిచ్చుపెట్టే
మేకవనె్న పులుల కోసం
అర్థరహిత అమానుష ఇజాలు వాదాల కోసం
పదవీ వ్యామోహ వ్యభిచారంలో
శత్రువు మిత్రుడు ఒకటేనంటూ
అధికార జెండాయే ఎజెండా అంటూ
జాతిని నిస్సిగ్గుగా దోచుకునే
నాయకుల కోసం
జారిపోతున్నారమ్మా జారిపోతున్నారు
ఎన్నాళ్లమ్మా? ఇంకెన్నాళ్లు?
ఈ అర్థరహిత బలిదానాలు
నీ బిడ్డల ప్రాణత్యాగాలు
వృథా కానీకమ్మా! వృథా కానీకు...
*

- వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు 94911 71327