S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిరంతర కళాసేవకు నిండైన అవార్డులు

శ్రీమతి కోన మృదుల ప్రఖ్యాత కూచిపూడి గురువు, జానపద కళాకారిణి. ఆమె గృహిణిగా, ఎన్నో వ్యక్తిగత బాధ్యతలు ఒకవైపు నిర్వహిస్తూ, మరొకవైపు ఎన్నో సంవత్సరాలుగా నృత్యం నేర్పిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆమె నటరాజ నృత్య కళానికేతన్ 2003లో స్థాపించి, కూచిపూడి, జానపద నృత్యం నేర్పిస్తున్ఘ్నారు. కళాసేవలో భాగంగా మాట్లాడలేని పిల్లలకు కూడా నృత్యం నేర్పిస్తున్నారు. దేశమంతటా వీరు, వీరి శిష్యులు ఎన్నో నృత్య ప్రదర్శనలిచ్చారు. ఎన్నో బహుమతులు, పతకాలు, గౌరవాలు, సన్మానాలు పొందారు. వీరు కాకతీయ విశ్వవిద్యాలయంలో బి.ఏ. సోషియాలజీ చేశారు. అలాగే పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడి సర్ట్ఫికెట్ కోర్సు చేశారు.
మృదులతో ముఖాముఖి...
మా అమ్మ కీ.శే. కాకరాల లక్ష్మీ ప్రభాకర్ నృత్యంలో నా గురువు. తరువాత వరంగల్‌లో కీ.శే. వెంపటి నాగేశ్వరిగారి వద్ద కూడా నృత్యం నేర్చుకున్నాను. నాన్నగారు కాకరాల సూర్యప్రభాకర్ జానపద కళాకారుడు, మిమిక్రీ ఆర్టిస్టు. తాతగారు కాకరాల బుజ్జిరాజుగారు రంగస్థల కళాకారుడు. ఇలా మా కుటుంబమంతా కళాసేవకే అంకితమైంది. ఇప్పుడు మా బాబు అద్వైత్ (7 సం.) కూడా జానపద నృత్యం నేర్చుకుంటున్నాడు. పెళ్లికి ముందు మా అమ్మానాన్న నన్ను కళల్లో ఎంతో ప్రోత్సహించారు. నేను చదువు, నృత్యం అన్నీ నేర్చుకోవడం, ఏ ఇబ్బందీ లేకుండా మా అమ్మ చూసుకునేది. పెళ్లి తరువాత మావారు, అత్తమామలు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అందువల్ల ఎలాంటి వొడిదుడుకులు లేకుండా నా కళా ప్రయాణం సాఫీగా జరుగుతోంది.
చిన్నప్పుడు రోజూ 4-5 గంటలు ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇప్పుడు దినం విడిచి దినం, వారానికి మూడు క్లాసులు తీసుకుంటున్నా.
2016లో నాట్య విశారద అవార్డు - భక్తి టీవీ
ఓం నమో వేంకటేశాయ సినిమాలో నా శిష్యులు వేయినామాల వాడు పాటలో అనుష్కతో పాటు నృత్యం చేశారు. దీనికి కొరియోగ్రఫీ - రూపకల్పన రాజు సుందరం చేశారు.
2016లో పూణెలో అఖిల భారతీయ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఎన్నో అవార్డులు పొందారు.
ఉత్తమ గురువు అవార్డు - పూణె 2016
స్పెషల్ జ్యూరీ అవార్డు - స్పెషల్ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ - పూనా - 2016
2010లో జెమిని టీవీ - డాన్స్ ఎ.పి. డాన్స్ - మెంటోర్
మాటీవీ - ఛాలెంజ్ డాన్స్ ప్రోగ్రామ్ - అతిథిగా
జీ టీవీ - ఏఏటిఏ - 4 ఫైనల్స్ గీతిక - గణేశ్, ఏఏటిఏ -6 భూమికకు నృత్య శిక్షణ.
వనిత టీవీ - గెస్ట్ ఆఫ్ హానర్
దేవ పారిజాతం అవార్డు - కళానిలయం - 1995.
జెమిని టీవీ - డాన్స్ రాజు డాన్స్‌లో మొదటి బహుమతి లక్ష రూపాయలు - రాజు సుందరం గారిచే
వైఎంసిఏ - అఖిల భారత నృత్య పోటీలు
ఏలూరు - అఖిల భారత కూచిపూడి పోటీలు - నాట్యరాణి - వైఎంసిఏ
నాట్య కళాప్రవీణ - కళాసాగర్ అకాడెమీ
ఉత్తమ చైర్మన్ జ్యూరీ అవార్డు - ఉత్కళ సాంస్కృతిక సంఘం - ఒరిస్సా.
డాన్సింగ్ ఐడల్ - రాజు సుందరం
ఉత్తమ నర్తకి - చీరాల
కళాపీఠ్ కళాభూషణ్ అవార్డు - 2019
కీర్తి ఆర్ట్స్ అకాడెమీ - ఉగాది పురస్కారం - 2019
ఏడుకొండలు దసరా పురస్కారం - 2019
శ్రీనిధి ఓరుగల్లు పురస్కారం - 2019
శాంతికృష్ణ సేవా సమితి పురస్కారం - 2019

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి