S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కలయక

భూమిని ఎవరైనా
పట్టుకొని ఊపండి.
అగ్నిపర్వతాల్లో
బుసలు కొట్టే లావా బయటపడుతుంది.

భూమిని ఎవరైనా
గాలిలా నిమిరి ఓదార్చండి
సముద్రాలు
కన్నీళ్లుగా మారి వర్షిస్తాయి.

భూగోళం
వొఠ్ఠి జాగ్రఫీ కాదు,
వినగలిగితే
జీవచలన సంగీతం వినిపిస్తుంది.

ఈ క్షణాలను
విడిగా చూడొద్దు
ఇవి వేలాది నిన్నలను
కడుపులో దాచుకున్నాయి
అసంఖ్యాక భవితవ్యాలను
కలగంటున్నాయి.

భూభ్రమణం
కేవలం యాంత్రిక గమనం కాదు
నిన్న రాత్రి చేసిన
ఆటోగ్రాఫ్‌లా ఉంటుంది ఉదయం.

నువ్వూ భూమీ
ఎక్కడో
ఒక ఉద్వేగ రేఖ మీద కలుస్తారు,
కవిత్వమంటే అదే!

-డా. ఎన్.గోపి