S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తిరునగరీయం

అక్షరాలు రాని అర్భకుడును గూడ
నవ్యప్రక్రియకును నన్నయననె
తెలుగు కవిత ఎంత పలుచనైపోయెరా!
తిరునగరిది మాట తిరుగులేదు

ప్రతిభ ఉండవలయు పాండితివలయును
దండిగాను సృజన ఉండవలయు
అపుడు నవ్యసృష్టి అవనిలో నిలుచురా!
తిరునగరిది మాట తిరుగులేదు

సాహితీవ్రతుండు చదువరి కావాలె
ద్రష్టయైన కావ్యస్రష్టన
కవి మనీషి సూరి అవనికారాధ్యుడు
తిరునగరిది మాట తిరుగులేదు

మాటమాటలోన మధువులు కురిపించు
కవిత నిలుచు ఎల్లకాలమిలను
వసుధ మంచి కవిత వక్రోక్తిమయమురా!
తిరునగరిది మాట తిరుగులేదు

అంతలోనె ఇంకు ఆశుకవిత్వాలు
మాటలల్లికలు డమాలబండ్లు
మంచి కవిత నుండి మల్లీ సుగంధాలు
తిరునగరిది మాట తిరుగులేదు

-డా. తిరునగరి 9392465475