S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (16-6-2019 నుంచి 22-6-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని ఇబ్బందులకు అవకాశం. ఊహించని సంఘటనలుంటాయి. నిర్ణయాదులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక వ్యవహారాల వల్ల మేలు కలుగుతుంది. సంప్రదింపులలోనూ అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తల సహకారం ఆశిస్తారు. దగ్గరి ప్రయాణాల్లోనూ ఇబ్బందులుంటాయి. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కొంత అసంతృప్తి తప్పకపోవచ్చు. సుదూర ప్రయాణాలపై దృష్టి. దైవ ధర్మ కార్యాలు, దానాదుల వల్ల మంచి కలుగుతుంది. కొంత నిరాశ. మాటల్లో కొంత చమత్కారం. మాట తీరు వల్ల ఆర్థిక ప్రయోజనాలు. అధికారులతో సంప్రదింపులుంటాయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. పనిచేసే చోట సంతృప్తి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలపై దృష్టి. ప్రయాణాది సౌకర్యాలు పెంచుకుంటారు. విందులు వినోదాలుంటాయి. గృహ వాహనాదులపై ప్రత్యేక దృష్టి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలు లాభిస్తాయి. విద్యా రంగంలోని వారికి అనుకూలత. శ్రమ ఉన్నప్పటికీ సంతోషంగా గడుపుతారు. వారం మధ్యమంలో మానసిక ఒత్తిడులకు అవకాశం. కొత్త ఆలోచనలు ఉన్నా తొందరగా ఫలించకపోవచ్చు. సంతానవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. క్రియేటివిటీ పెంచుకుంటారు. కొంత నిరాశ తప్పకపోవచ్చు. ఆలస్య నిర్ణయాదులుంటాయి. వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. లాభాలు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. వారాంతంలో పోటీలు ఒత్తిడులు వ్యతిరేకతలు ఇబ్బంది పెడతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు సంతోషాన్నిస్తాయి. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. ప్రయాణావకాశాలు. విందులు వినోదాలతో గడుపుతారు. విశ్రాంతి లభిస్తుంది. వ్యాపార వ్యవహారాలకు అనుకూలం. దైవ ధర్మ కార్యక్రమాల కోసం ప్రయాణాలు, ఖర్చులు, దానాలుంటాయి. వారం మధ్యమంలో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాల్సి వస్తుంది. బద్దకం బాగా ఉంటుంది. భాగస్వామ్యాల్లోనూ జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు కూడదు. బాధ్యతలను కష్టంతో నిర్వర్తించాల్సి వస్తుంది. అలసిపోయే అవకాశం. ధార్మిక కార్యక్రమాల వల్ల మేలు కలుగుతుంది. కొంత నిరాశ ఉన్నప్పటికీ పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. మాట తీరు అనుకూలంగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలపై దృష్టి. పార్ట్‌నర్‌తో కొన్ని ఇబ్బందులుండే అవకాశం. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత. పరిచయాలు పెంచుకుంటారు. స్నేహానుబంధాలలోనూ ఆచితూచి వ్యవహరించాలి. వారం మధ్యమంలో కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. నష్టాలు పొందకుండా చూసుకోవాలి. నిరాశా భావాలు పెరుగుతాయి. పెట్టుబడులు మంచిది కాదు. దానధర్మాల వల్ల మేలు. నిర్ణయాదుల్లో అప్రమత్తంగా మెలగాలి. శ్రమ అధికవౌతుంది. దైవ కార్యాలు, ఆధ్యాత్మిక యాత్రల వల్ల లోపాలు నివారించబడతాయి. వారాంతంలో గొప్ప పనులను నిర్వహిస్తారు. ఉన్నత విద్య, ఉద్యోగాదులపై దృష్టి ఉంటుంది. వ్యవహారాల్లో సానుకూల ధోరణి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అనుకూలం. పెద్దలతో కమ్యూనికేషన్స్ ఉంటాయి. మంచి వార్తలు వింటారు. సోదర వర్గంతోనూ అనుకూలత. ఇతరులకు సహకరించడం వల్ల మేలు కలుగుతుంది. వారం మధ్యమంలో సౌకర్యాదులపై దృష్టి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గృహ వాహనాదుల విషయంలో కొత్త నిర్ణయాదులు కూడదు. విందులు వినోదాల విషయంలోనూ జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. సామాజిక గౌరవం పెంచుకుంటారు. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. కొత్త ప్రణాళికలుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో లాభాలు సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి. పెద్దల అనుకూలత. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలుంటాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. వారం మధ్యమంలో వ్యర్థమైన ఖర్చులుంటాయి. ప్రయాణాదుల్లో ఇబ్బందులు. విశ్రాంతి లోపిస్తుంది. అనారోగ్య భావనలకు అవకాశం. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. పరామర్శలకు అవకాశం. సౌఖ్యలోపం తప్పకపోవచ్చు. స్ర్తివర్గ సంబంధాంశాల్లో కొంత అనుకూలత. వారాంతంలో నిర్ణయాదుల్లో అనుకూలత. అత్యంత ఆత్మవిశ్వాసం. అన్ని పనుల్లోనూ శుభ పరిణామాలు. గుర్తింపు. గౌరవాదులు లభిస్తాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీ రంగంలో గుర్తింపు. కాంపిటీషన్స్‌పై దృష్టి. ఎదిరింపు ధోరణి ఉంటుంది. మొండి వైఖరి పనికిరాదు. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టే సూచనలు. నిర్ణయాదుల్లోనూ జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో పరిచయాలు, స్నేహానుబంధాల్లో ఇబ్బందులుంటాయి. నిరాశ తప్పదు. అన్ని పనుల్లోనూ ఆలస్యం ఉంటుంది. భాగస్వామితో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత. విందులు వినోదాలకు అవకాశం అధికం. దానధర్మాల వల్ల ఇంకా మేలు కలుగుతుంది. వారాంతంలో సమస్యలు అధికం. లోపాలు పెరుగుతాయి. నిర్ణయ శక్తి తగ్గుతుంది. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. ఊహించని సంఘటనలకు అవకాశం. ఆరోగ్య లోపాల వల్ల ఇబ్బంది. కొన్ని పనులను వాయిదా వేయాల్సి వస్తుంది.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబం, బంధువర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. మాట తీరులో మంచి మార్పు ఉంటుంది. కొత్త ఆలోచనలను మాటల ద్వారా చెప్పే అవకాశం ఉంటుంది. భావ వ్యక్తీకరణకు చాలా అనుకూలం. వారం మధ్యమంలో సేవక వర్గంతో సంప్రదింపులుంటాయి. శ్రామిక సహకారం అధికంగా లభిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అనుకూలం. దగ్గరి ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా మసలుకోవాలి. సోదరులతో ఇబ్బందులకు అవకాశం. దైవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మేలు కలుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకునే ప్రయత్నం. సుదూర ప్రయాణాదులపై దృష్టి. వారాంతంలో ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. గృహ వాహనాదుల విషయంలో మంచి నిర్ణయాదులు, చర్చలు ఉంటాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలపై దృష్టి. బాధ్యతలు అధికం. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. అనుకోని బాధ్యతలు వెంటపడుతుంటాయి. శారీరక శ్రమ ఉంటుంది. సామాజికమైన గౌరవం పెంచుకుంటారు. సౌకర్యాల విషయంలో ఆశించిన సంతోషం ఉండకపోవచ్చు. వారం మధ్యమంలో లాభాలపై దృష్టి. ఆశించిన లాభాలు అందకపోవచ్చు. ప్రయోజనాలు ఆశించినంతగా దొరకకపోవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. కొంత నిరాశ ఉంటుంది. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. అనేక భావాలు ఇబ్బంది పెట్టే అవకాశం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. విశ్రాంతి లభిస్తుంది. విందులు వినోదాలలో పాల్గొంటారు. సౌఖ్యంగా గడుపుతారు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. అభీష్టాలు ఫలిస్తాయి. కొత్త ప్రణాళికలు. క్రియేటివిటీతో పని చేస్తారు. సలహాలు బాగా ఇచ్చే అవకాశం. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. నిర్ణయాదుల్లో అనుకూలత. మానసికమైన ఉత్సాహం ఉంటుంది. వారం మధ్యమంలో పోటీ రంగంలో విజయం సాధిస్తారు. వ్యతిరేకతలను అధిగమిస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. అన్నింటిలోనూ ఎదురీదాల్సి వస్తుంది. రుణ రోగాదులపై విజయం. గుర్తింపు కోసం ప్రయత్నం. కొంత ప్రశాంతంగా గడపడం మంచిది. దైవ ధ్యానం వల్ల కార్యాలు సానుకూలమవుతాయి. ఖర్చులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ప్రభుత్వ చెల్లింపులు ముందుగా చెల్లించాలి. వారాంతంలో పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతలు సంతోషాన్నిస్తాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. సామాజిక గౌరవం కూడా లభిస్తుంది. భాగస్వామ్యాల్లో అనుకూలత. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. వారం మధ్యమంలో మాటతీరులో ఇబ్బంది. భావ వ్యక్తీకరణ ఆశించినంత బాగా ఉండక ఇబ్బంది పడే సూచనలు. కొంత నిరాశ ఉంటుంది. కుటుంబ వర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. బంధువులతో సంప్రదింపుల్లోనూ ఇబ్బందులు. నిల్వధనం కోల్పోయే సూచనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. చిన్నచిన్న ప్రమాదాలకు, ఒత్తిడులకు అవకాశం. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదర వర్గంతో అనుకూలత.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. విద్యారంగం, పరిశోధనా రంగాలలోని వారికి అత్యంత అనుకూలత. గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. సుదూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వ్యవహారాల్లో అనుకూలత. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాదుల్లోనూ నష్టాలు వాటిల్లుతాయి. శారీరక మానసిక వత్తిడులుంటాయి. ఎంతో శ్రమతో గుర్తింపు లభిస్తుంది. పితృవర్గం వారికి సంబంధించిన సమస్యలుంటాయి. ఉద్యోగంలో, పనిచేసే చోట పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744