S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కంగారు పుట్టించేనా?!

నాటింగ్‌హామ్: దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి అగ్రశ్రేణి జట్లను మట్టికరిపించిన బంగ్లాదేశ్ గురువారం డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొనబోతుంది. పసికూనగానే టోర్నీలోకి ప్రవేశించిన బంగ్లా అంచనాలకు మించి రాణిస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో చక్కటి ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొయ్యగా మారుతోంది. ఈ మెగా టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఫలితం తేలకపోగా, ఆడిన నాలుగింట్లో రెండు విజయాలు, రెండు పరాజయాలతో దూసుకుపోతోంది. అయతే ఇప్పటికే భారత్‌తో మినహా మిగతా నాలుగు మ్యాచు ల్లో విజయం సాధించిన కంగారూలను బంగ్లా అడ్డుకుంటుందా? మరో సంచలనానికి తెర తీస్తుందా? అనేది చూడాల్సిందే.
షకీబ్ అంతా తానై..
బంగ్లాదేశ్ జట్టుకి సగం బలం ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసనే. ఈ టోర్నీలో నాలుగు మ్యాచుల్లోనూ షకీబ్ జట్టు అసాధారణ ప్రతిభ కనబరిచాడు. అటు బ్యాటింగ్‌తోనే కాకుండా బౌలింగ్‌తోనూ రాణించి అంతా తానై జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. గత నాలుగు మ్యాచుల్లో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో రాణించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు షకీబ్ ఆడిన తీరు అద్భుతమనే చెప్పాలి. 322 పరుగుల భారీ లక్ష్యాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చివరి వరకు క్రీజులో ఉండి జట్టును ముందుండి నడిపించాడు. గెలుపుకు దగ్గరయ్యాక సహచర బ్యాట్స్ మెన్ లిటన్ దాస్‌కు స్ట్రైక్ ఇస్తూ, అతడిని ప్రోత్సహించాడు. ఇక షకీబ్‌కు తోడు ముస్తాఫిజుర్ రహమన్, తమీమ్ ఇక్బా ల్, సౌమ్యా సర్కార్ వంటి ఆటగాళ్లు రాణిస్తే బంగ్లాకు తిరుగుండదనే చెప్పాలి. ఇక బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ బంగ్లాదేశ్ బలంగానే కనిపిస్తోంది. కెప్టెన్ మషఫ్రే మోర్తాజాతో పాటు మహమ్మద్ సైఫుద్దీన్, మిస్తాఫిజుర్ రహమన్, షకీబ్ అల్ హసన్ వంటి ఆల్ రౌండర్లు రాణిస్తుండడం బంగ్లాకు కలిసొచ్చే అంశం.
విజయ పరంపర కొనసాగిస్తుందా..?
ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయం సాధించి, ఒకటి ఓడిపోయన ఆస్ట్రేలియా జట్టు తమ విజయ పరంపర కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బాల్ ట్యాంపరింగ్, నాయకత వ లోపంతో మెగా టోర్నీకి ముందు సతమతమైన డిఫెండింగ్ చాంపియన్ ఆసిస్ ఈసారి ఎలాంటి అంచనాల్లేకుండానే బరిలోకి దిగింది. అయతే అందరి అంచనాలను తలకిందులు చేసి, ప్రత్యర్థి జట్లకు తామెంటో మరోసారి నిరూపిం చింది. అయతే ఇప్పటివరకు భారత్‌తో మ్యాచ్ ఓడి పోగా, పాక్‌ను మినహాయస్తే కంగారూలు గెలిచింది చిన్న జట్లపైనే. రానున్న మ్యాచుల్లో ఇంగ్లాండ్, న్యూ జిలాండ్, దక్షిణాఫ్రికా వంటి పెద్ద జట్లతో తలపడాల్సి ఉంది. మరోవైపు సంచలనాలు సృష్టిస్తున్న బంగ్లాదేశ్ వంటి జట్టుతో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
కంగారూలదే పైచేయ..
మెగా టోర్నీల్లో బంగ్లాదేశ్‌తో తలపడిన మూడు మ్యాచుల్లో కంగారూలే పైచేయ సాధించారు. 1999లో 10 వికెట్ల తేడాతో, 2007లో 7 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపొందారు. గత ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయంది.
బ్యాటింగే బలం..
ఆస్ట్రేలియా జట్టుకు బ్యాటింగే ప్రధాన బలం. ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌తో పాటు మూడో స్థానంలో స్టీవెన్ స్మిత్ రాణిస్తుండగా, లోయర్ మిడి లార్డర్‌లో కౌల్టర్ నైల్ అలెక్స్ క్యారీ, గ్ల్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి బ్యాట్స్‌మెన్లు జట్టు అవసరాలను బట్టి చెలరేగుతున్నారు. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే కెప్టెన్ ఫించ్ (343) ఒక సెంచరీతో పాటు రెండు అర్ధ సెంచ రీలు సాధించగా, డేవిడ్ వార్నర్ కూడా సెంచరీతో పాటు రెండు అర్ధ సెంచరీలు చేశాడు. మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మూడు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఇక బౌలింగ్‌లో మిచెల్ స్టార్‌తో పాటు ప్యాట్ కమిన్స్, కేన్ రిచర్ డసన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ వంటి బౌలర్లు ఉన్నారు.
చిత్రాలు.. షకీబ్ అల్ హసన్
*ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్