S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమీర్ ఖాతాతో నీజర్ పోరు రద్దు

న్యూఢిల్లీ, జూన్ 26: బ్రిటిష్ స్టార్ బాక్సర్ అమీర్ ఖాన్‌తో వచ్చేనెల 12వ తేదీన సౌదీ అరేబియాలో జద్దాలో జరగాల్సిన డబ్ల్యూబీసీ పెరల్ వరల్డ్ చాంపియన్‌షిప్ పోరులో భారత ప్రొఫెషనల్ బాక్సర్ నీరజ్ గోయట్ పాల్గొనడం లేదు. హర్యానాకు చెందిన 27 ఏళ్ల నీరజ్ రెండు పర్యాయాలు పెరల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న అమీర్ ఖాన్‌ను ఢీకొనేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యాడు. అయితే, కారు ప్రమాదం లో తీవ్రంగా గాయపడడంతో, ఆ బౌట్‌లో పాల్గొనడం లేదు. మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో నీరజ్ తల, ముఖం, ఎడమ చేతికి బలమైన గాయాలయ్యాయని, ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సూపర్ బాక్సింగ్ లీగ్ ప్రమోటర్ బిల్ డొజన్ ఒక ప్రకటనలో తెలిపాడు. బౌట్ ముందుగానే ఖరారైన కారణంగా, నీరజ్ స్థానంలో మరో బాక్సర్ కోసం అక్కడి నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నాడు. డబ్ల్యూబీసీ ఆసియా వెల్టర్‌వెయిట్ టైటిల్‌ను సంపాదించిన నీజర్ ఇంత వరకూ కెరీర్‌లో 16 ఫైట్స్‌లో పాల్గొన్నాడు. 11 విజయాలు సాధించాడు. వాటిలో రెండు నాకౌట్ ద్వారా లభించినవే కావడం విశేషం. మూడు పరాజయాలను ఎదుర్కోగా, రెండు ఫైట్స్‌లో ఎలాంటి ఫలితం తేలలేదు.