S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫిట్నెస్ ప్రమాణాలు పెంచుకోండి

హైదరాబాద్, జూన్ 26: ఫిట్నెస్ ప్రమాణాలను పెంచుకోవాలని, గాయాలకు దూరంగా ఉండాలని క్రీడాకారులకు బా డ్మింటన్ జాతీయ కోచ్ గోపీచంద్ హితవు పలికాడు. రాబో యే జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో రాణించాలంటే, ఫిట్నెస్‌తోపాటు గాయాల బారిన పడకపోవడం కూడా అత్యవసరమ ని వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌లో ఇంత వరకూ సైనా నెహ్వాల్ మాత్రమే అంతర్జాతీయ టోర్నీల్లో పతకాన్ని గెల్చుకోగలిగింది. ఇండోనేషియా మాస్ట ర్స్ టోర్నీ ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోవలినా మారిన్ గాయం కారణంగా వైదొలగింది. కాగా, బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్‌లో సాయి ప్రణీత్, ఇండియన్ ఓపెన్ సూపర్ 500 ఈవెంట్స్‌లో కిడాంబి శ్రీకాంత్ తమతమ తుది పోరాటాల్లో పరాజయాలను ఎదుర్కొని, టైటిళ్లను చేజార్చుకున్నారు. చైనా ఆటగాడు షి యూ క్వి చేతిలో ప్రణీత్ ఓడగా, శ్రీకాంత్‌పై విక్టర్ అక్సెల్సెన్ గెలిచాడు. ఈ టోర్నీలనను గోపీచంద్ ప్రస్తావిస్తూ, ఫైనల్ వరకూ చేరడం గొప్ప విషయమేనని, సీజన్‌లో జరిగే తదుపరి టోర్నీలకు అవసరమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పాడు. వచ్చేనెలలో ఇండోనేషియా, జపాన్, థాయిలాండ్ దేశాల్లో టోర్నీలు ఉన్నాయని, వీటిలో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తారన్న నమ్మకం తనకు ఉందని గోపీచంద్ బుధవారం ఇక్కడ కొత్త బాడ్మింటన్ కేంద్రానికి జరిగిన భూమిపూజకు హాజరైనప్పుడు విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు.