S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అన్నం తింటున్నారా?

బరువు తగ్గాలనుకునేవారిని అన్నం మానేసేయండి అని చెబుతుంటారు డాక్టర్లు లేదా జిమ్ ఇన్‌స్ట్రక్టర్లు. అందుకని మనసులో అన్నం తినాలని ఉన్నా.. మానేస్తారు. నోరు కట్టేసుకుంటారు. ఫలితంగా ఏం తిన్నా వారికి తిన్నట్టుగానూ, ఇంకా ఇంకా ఆకలిగానూ, సంతృప్తి లేకుండా ఉంటుంది. ఇలాంటివారు అన్నాన్ని విభిన్న తరహాల్లో వండి తీసుకుంటే ఇబ్బంది ఉండదు.. ఆ పద్ధతులేంటో చూద్దాం..
* బియ్యంలో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఉడికే బియ్యంలో కూరగాయ ముక్కలు వేయాలి. ఈ రెండింటినీ ఇలా కలిపి వండటం వల్ల గ్లైసమిక్ ఇండెక్స్ శాతం తగ్గుతుంది. పైగా కూరగాయల నుంచి పోషకాలు కూడా అందుతాయి.
* ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇది గ్లూకోజ్‌గా మారడానికి ఎక్కువ సమయమే పడుతుంది.
* రోజూ అన్నాన్ని తినాలనుకునేవారు కుక్కర్‌లో వండకూడదు. కుక్కర్‌లో వండితే దానివల్ల గంజి అన్నంలోనే ఇమిడిపోతుంది. ఫలితంగా కార్బోహైడ్రేట్లు అలానే ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ అసమతుల్యత ఎదురవుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు నేరుగా గినె్నలోనే వండేసి.. గంజి వంపేస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
* అన్నం తినకుండా ఉండలేనివారు రోజులో కప్పు మాత్రమే అన్నాన్ని తీసుకోవాలి. దీనితో పాటు పదార్థాల మోతాదు పెంచాలి. పచ్చి కూరగాయముక్కలు తినాలి.
* అన్నం తగ్గించి బదులుగా పండ్లు తినవచ్చు.
* ఒకవంతు అన్నం, మరోవంతు గోధుమరవ్వ ఉప్మా లేదా కొర్రలు, పుల్కాలను ఎంచుకోవచ్చు. దీనివల్ల అన్నం మోతాదు తగ్గుతుంది. *