S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఊహకందని అద్భుతాలు -2

* చైనాలోని లీచెంగ్ కౌంటీలో సాయంత్రం ఒపెరా ప్రదర్శనకు చాలామంది కళాకారులు సిద్ధమవుతుంటారు. మేకప్ వేసుకునే దగ్గరి నుంచి స్టేజ్‌పై ప్రదర్శన ఇచ్చేవరకూ రోజంతా వీరితోనే గడిపాడు ఫొటోగ్రాఫర్ హాఫెంగ్ లీ. చైనాలోని లోస్ మైదానంలో స్థానికులు లోస్ పొరలో గుంతలు తవ్వి గుహల వంటి గదులను ఏర్పాటు చేసుకుంటారు. వీటిని యెడాంగ్లు అంటారు. ఇందులో వేడిని కాపాడే గుణాలు ఉంటాయి. ఇవి శీతాకాలంలో జనం తీవ్ర చలిని తట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ ఫొటో మనుషుల విభాగంలో మొదటి బహుమతిని సొంతం చేసుకుంది.

* బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఇజ్తమా సమయంలో ప్రజలు వీధిలో ప్రార్థన చేస్తారు. ముఖ్యమైన ఇస్లామ్ పండుగల్లో బిష్వా ఇజ్తమా ఒకటి. ఢాకాలో ఏటా జరిగే ఈ పండుగకు లక్షలాది ముస్లింలు హాజరవుతారు. ఇంత భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ప్రార్థనా మైదానాలు సరిపోవు. దీంతో చాలామంది ముస్లింలు ఢాకా మెయిన్‌రోడ్‌కి వస్తారు. ఆ సమయంలో అక్కడ రవాణా వ్యవస్థను నిలిపేస్తారు. ఈ ఫొటోని సందీపని చటోపాధ్యాయ్ తీశారు. దీనికి మూడో బహుమతి వచ్చింది.

* ఇండియాలోని దిల్లీలో యమునా నది ఒడ్డున సూర్యోదయం సమయంలో వౌనంగా ఆలోచిస్తున్న ఓ బాలుడిని ఫొటో తీశాడు నవీన్ వాస్తా. వేలాది సీగల్స్ మంద్రస్థాయిలో లయబద్ధంగా చేస్తున్న శబ్దాన్ని అక్కడి సందర్శకులు ఆస్వాదిస్తున్నారు. తూర్పు దిక్కు నుంచి ఉదయపు బంగారు వర్ణపు వెలుగు, పశ్చిమ దిక్కు నీలికాంతితో కలిసి ఒక అలౌకిక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ ఫొటోకి గౌరవ బహుమతి లభించింది.

* హాంకాంగ్‌లోని చోయ్ హుంగ్ హౌస్ దగ్గర ఉన్న ఓ పబ్లిక్ పార్క్‌లో తీసిన ఫొటో ఇది. మధ్యాహ్నం వేళ ఫొటోగ్రాఫర్ యోషికి ఫుజివారా అక్కడికి వెళ్లినప్పుడు అది చాలా రద్దీగా ఉందట. చాలామంది యువకులు అక్కడ బాస్కెట్‌బాల్ ఆడుతున్నారట. కానీ సూర్యోదయం సమయంలో వెళ్లినప్పుడు అది చాలా ఖాళీగా, నిశ్శబ్దంగా ఉందట. ఆ సమయంలో ఒక వృద్ధుడు తాయ్ చీ చేస్తున్నప్పుడు అదో మార్మిక ఘట్టంలా కనిపించిందట ఫొటోగ్రాఫర్‌కి. ఆ ఫొటోయే ఇప్పుడు రెండో బహుమతిని సొంతం చేసుకుంది.

* స్పెయిన్‌లో ప్రతి ఏటా సెయింట్ ఆంటోనీ ఫీస్ట్ రోజున లాస్ ల్యూమినరియాస్ అని పిలిచే జంతువుల శుద్ధి పండుగ జరుగుతుంది. పద్దెనిమిదో శతాబ్దం నుంచి జరిగే ఈ క్రతువులో అవీలా ప్రావిన్స్‌లో గుర్రాలు, రౌతులు మండల మీదుగా దూకుతారట. ఆ సందర్భంగా తీసిన ఫొటో ఇది. దీన్ని జోస్ ఆంటోనియా జమోరా తీశాడు. దీనికి మూడో బహుమతి వచ్చింది.