S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నవ్వులాట కాదు ఉన్నమాట

నవ్వులాట కాదు
ఉన్న మాట
నలుగురి నోటా
నానుతున్న మాట
రోజూ మనిషి పయనిస్తున్న బాట
ఏ మోజూ లేని అయోమయం పాట
*
గృహిణి ఇచ్చిన కాఫీతో
గ్రహణం విడిచిన చంద్రుడిలా
విప్పారిన వదనంతో పేపరు విప్పితే
అత్యాచారం, అనాచారం
ఆర్తనాదం, పిడివాదం
వీటితో తల తిరగడం
*
ద్విచక్ర వాహనంపై
దిక్కులు చూస్తూ, ఏ వాహనం
పైన పడకుండా తప్పించుకొంటూ
రొప్పుతూ రోజుతూ వచ్చి
ఆఫీసులో పడడం
*
ఆలస్యానికి కారణమడిగి
ఆఫీసరుగారు కడగడం
తుడుచుకొంటూ పనిభారం మోయడం
సాయంకాలం కాగానే కాలు కదపడం
*
ఎక్కడ ఏ పెద్ద శబ్దం విన్నా
విస్ఫోటనమేమోనన్న
భయంతో వెర్రిచూపులు చూస్తూ
కావాల్సిన కొనుగోళ్లు కానించి
బిక్కుబిక్కుమంటూ ఆకాశాన్ని
చూడగానే ఏ కాలమో తెలీకుండా వాన భయంతో
పరుగులు తీయడం

-షణ్ముఖశ్రీ.. 8897853339