S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లయ

1982లో ‘లయ’ అన్న కవితా సంపుటిని నలుగురు కవి మిత్రులతో కలిసి ప్రచురించాను. ఆ మిత్రులు పి.ఎస్. రవీంద్ర, వారాల ఆనంద్, వఝల శివకుమార్, అలిశెట్టి ప్రభాకర్. ఆ రిథమ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అలిశెట్టి ఆకస్మికంగా మరణించాడు.
జీవితంలో రిథమ్ ఎప్పుడూ ఉంటుంది.
చూసే చక్షువు వుండాలి. అంతే!
పసిపిల్లవాడి ఏడుపులో ఒక రకమైన రిథమ్ ఉంటుంది.
ఉదయం పూట పక్షి అరుపులో ఒక రకమైన రిథమ్ ఉంటుంది.
కష్టజీవి హైలెస్సాలో...
రంపపు కోతలో...
ధాన్యాన్ని దంచుతున్న మహిళల చేతుల్లో...
నీటిని తోడుతున్న రైతు శ్రమలో...
కబడ్డీ ఆటలో...
చెట్టుని నరుకుతున్న గొడ్డలి వేటులో
ఒక రిథమ్ ఉంది.
ఈ సృష్టిలో రిథమ్ లేని పని లేదు.
కత్తిని తయారుచేసేటప్పుడు
అదే విధంగా పదును చేసేటప్పుడు
ఒక రిథమ్ ఉంటుంది.
సంగీత వాయిద్యాలలోనే కాదు...
జీవితంలోని ప్రతి సన్నివేశంలో...
ప్రతి పనిలో ఓ రిథమ్ ఉంది.
ఓ సంగీతం ఉంది.
సంతోషంలోనూ రిథమ్ ఉంది.
దుఃఖంలో అంతకు మించిన రిథమ్ ఉంది.
మా అక్క చనిపోయినప్పుడు, మా ఊరి నుంచి వచ్చిన మా బంధువు కాస్త ఆలస్యంగా వచ్చింది. ఆఖరి చూపునకు నోచుకోలేదు.
అప్పటికే చితిని అంటించారు.
అప్పుడు ఆమె దుఃఖంలోని రిథమ్ వర్ణించలేనిది. ఎవరి మరణాన్ని చూసినా ఆమె దుఃఖంలోని రిథమ్ నా గుండెల్లో మార్మోగుతుంది.
పుట్టుకలో...
చావులో...
ఆటలో, అలలో, వొంపులో, వరదలో...
పాటలో...
వేటలో...
అంతటా ఓ రిథమ్ ఉంది.
ఓ సంగీతం ఉంది.
వినే చెవులు వుండాలి.
చూసే కన్నులు వుండాలి.
మా ‘లయ’ మాలో ఇంకా మార్మోగుతుంది.
అందుకే కవులుగా కొనసాగుతున్నాం నేనూ నా మిత్రులూ.

మంగారి రాజేందర్ ‘జింబో’