S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (14-7-2019 నుంచి 20-7-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలు ఎదురౌతాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కార్యనిర్వహణలో సంతోషం. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలం. కొంత అసంతృప్తి ఉండే అవకాశం. స్ర్తి వర్గంతో సంప్రదింపులు ఉంటాయి. సహకారం లభిస్తుంది. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. సామాజిక జీవితం, గౌరవం, గుర్తింపులు ప్రాధాన్యం వహిస్తాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి. సౌకర్యాలు కొంత శ్రమకు గురి చేస్తాయి. అభీష్టాలు నెరవేరుతాయి. ఆహార విహారాలపై దృష్టి ఉన్నా సాధించడం కష్టమవుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంటుంది. వారాంతంలో అన్ని పనుల్లో ప్రయోజన దృష్టి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. గృహ వాహనాల విషయాలు చర్చకు వస్తాయి. విశ్రాంతి కోసం ప్రయత్నం. వ్యాపారం కోసం పెట్టుబడులు. క్రమంలో మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వ్యవహారాలు చర్చకు వస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం. కొత్త పనులపై దృష్టి. వ్యవహారాల్లో అనుకూలత. వారం మధ్యమంలో వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. పోటీలు ఒత్తిడులున్నా కార్యక్రమాల నిర్వహణలో అనుకూలత. రుణ రోగాదులను అధిగమిస్తారు. కాంపిటీషన్స్‌లో కొంత జాగ్రత్త. పోటీ రంగంలో తొందరపాటు కూడదు. ప్రభుత్వ చెల్లింపులను వెంటనే చెల్లించాలి. విశ్రాంతి లోపం సంభవం. పరామర్శలకు కూడా అవకాశం. జాగ్రత్త అవసరం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడుల విషయం చర్చిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో కొంత కోల్పోవాల్సి రావచ్చు. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం. క్రమంలో నిర్ణయాదులు ఇబ్బంది పెడతాయి. కార్యనిర్వహణలో సమస్యలు. పనుల ఒత్తిడికి సతమతమవుతారు. శ్రమాధిక్యం. బద్ధకం తగ్గించుకోవాలి. పోస్ట్‌పోన్‌మెంట్ కూడదు. భాగస్వామ్యాలు ప్రభావితం చేస్తాయి. వారం మధ్యమంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకుంటారు. బంధువర్గ వ్యవహారాల్లో పాల్గొంటారు. కొన్ని ప్రభుత్వ సంబంధమైన అంశాల్లో సమస్యలుంటాయి. చిన్నచిన్న ప్రమాదాలకు అవకాశం. జాగ్రత్తగా మెలగాలి. వారాంతంలో సలహాలు, సంప్రదింపులుంటాయి. సహకారం లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాల విస్తరణ. వ్యాపార సంప్రదింపులకు అనుకూలం. క్రమంలో ఇబ్బందులు అధికం. అనుకోని సమస్యలుంటాయి. ఊహించని సంఘటనలుంటాయి. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. అనారోగ్య భావనలుంటాయి. అప్రమత్తంగా మెలగాలి. నిరాశ అధికం. కుటుంబ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. సంప్రదింపులు శ్రమకు గురి చేయవచ్చు. వారం మధ్యమంలో అతి పెద్ద లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కార్యనిర్వహణలో అనుకూలత. సంతృప్తి. దైవ ధర్మ కార్యాలవైపు దృష్ట. సంప్రదింపులకు అనుకూలం. సోదర వర్గంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశం. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులు సంతోషాన్నిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో పెద్దలు, గురువులతో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. వ్యాపార సంబంధమైన ప్రయోజనాలు నెరవేరుతాయి. క్రమంలో సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో ఇబ్బందులు. గృహ వాహనాదుల విషయంలో ఏదో చికాకులు. విద్యా సంబంధమైన ఒత్తిడులు. శ్రమ అధికం అవుతుంది. సౌఖ్య లోపం సంభవం. వృత్తిపరమైన కొంత అనుకూలత. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతోషంగా గడుపుతారు. కొత్త పనులుంటాయి. నూతన నిర్ణయాదులు. సృజనాత్మకతతో వ్యవహరిస్తారు. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. వేరువేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. వారాంతంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు ఒత్తిడులున్నా విజయం సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో లాభాలు సంతోషాన్నిస్తాయి. వేరు వేరు కార్యక్రమాల్లో ప్రయోజన సిద్ధి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనేక కార్యక్రమాల నిర్వహణకు ప్రేరణ లభిస్తాయి. వ్యాపార భాగస్వామ్యాల్లో అనుకూలత. క్రమంలో పెట్టుబడులు అధికం. వ్యర్థమైన ప్రయాణాలు, ఖర్చులకు అవకాశం. పరామర్శలుంటాయి. విశ్రాంతి లోపాలకు అవకాశం. నిరాశా ధోరణి. వ్యతిరేకతలు అధికం. వారం మధ్యమంలో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. అనేక బాధ్యతలను నిర్వర్తిస్తారు. కార్యనిర్వహణ దక్షత. కొత్త పనులపై దృష్టి. భాగస్వామ్యాల్లో కొన్ని సమస్యలుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాలు, అధికారులతో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వారాంతంలో కుటుంబ వ్యవహారాలపై దృష్టి. ఆర్థిక నిర్ణయాలు సంతోషాన్ని ఇస్తాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకతలు, పోటీలు, ఒత్తిడులు అన్నీ ఎదురౌతాయి. వ్యవహారాల్లో శ్రమతో విజయ సాధనం. క్రమంలో భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు, స్నేహానుబంధాల్లో ఇబ్బందులకు అవకాశం. భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి. నిర్ణయాదులు అనుకూలమైనా సామాజిక వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వారం మధ్యమంలో అనుకోని ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలకు అవకాశం. ముఖ్య నిర్ణయాదులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక సంబంధమైన వత్తిడులు. ప్రభుత్వ చెల్లింపులు ఇబ్బంది పెట్టవచ్చు. మాటల్లో తొందరపాటు కూడదు. నిల్వధనం కోల్పోయే అవకాశం. వారాంతంలో ఉన్నత వ్యవహారాలు, కార్యక్రమాల నిర్వహణపై దృష్టి పెంచుకుంటారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాల్లో పాల్గొంటారు. నిల్వధనం పెంచుకుంటారు. మాట తీరు మారుతుంది. మాట విలువ పెరుగుతుంది. వృత్తిలో ఉన్నతి. క్రమంగా సేవక వర్గంతో సంప్రదింపులకు అనుకూలం. ఇతరులకు సహకరించడం వల్ల ఇంకా మేలు కలుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. పదోన్నతులకు అవకాశం. అధికారుల ఆదరణ. కొంత జాగ్రత్తగా కూడా మెలగాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో సౌకర్యాలు పెంచుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. విహారాలుంటాయి. సౌఖ్యంగా కాలం గడుపుతారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. వారాంతంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. కొత్త పనులపై దృష్టి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. అనేక బాధ్యతలు నిర్వర్తించాలి. క్షణం తీరిక దొరకని పనులుంటాయి. పెద్దల ఆదరణ లభిస్తుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. క్రమంలో కొన్ని ప్రయోజనాలు లభించక ఇబ్బంది పడతారు. సహకార, సేవా ధోరణితో కార్యక్రమాలను నిర్వర్తించాల్సి ఉంటుంది. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. చేతిదాకా వచ్చిన ప్రయోజనాలు కోల్పోయే అవకాశం. మనోభీష్టాలు నెరవేరుతాయి. స్ర్తివర్గంతో సంతోషంగా గడిపే అవకాశం. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. ప్రయాణావకాశాలు. విందులు వినోదాలు విహారాల కోసం వెచ్చిస్తారు. దానధర్మాల వల్ల మరింత మేలు కలుగుతుంది. పోటీలు ఒత్తిడులుంటాయి. విజయ సాధన కోసం పెట్టుబడులు. వారాంతంలో నిర్ణయాదులు లాభిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. నూతన కార్యక్రమాలపై దృష్టి. క్రమంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు ఒత్తిడులు చికాకులు ఉంటాయి. విజయం సాధించేందుకు ప్రయత్నం. అనేక కార్యక్రమాల్లో పాల్గొనక తప్పకపోవచ్చు. శ్రమాధిక్యం. నైరాశ్యాన్ని క్రమంగా అధిగమించాల్సి ఉంటుంది. విందులు, విలాసాల గూర్చి ఖర్చులు చేస్తారు. వారం మధ్యమంలో భాగస్వామ్యాలను పెంచుకుంటారు. సామాజిక అనుబంధాలు సంతృప్తిని ఇస్తాయి. శారీరక ఒత్తిడులు అధికం. అధికారిక వ్యవహారాలకు అనుకూలం. కార్యనిర్వహణలో శ్రమాధిక్యం. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. తొందరపాటు కూడదు. వారాంతంలో అనుకోని సమస్యలుంటాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు ప్రాధాన్యం వహిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనుల నిర్వహణ. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్యాల్లో అనుకూలత. ఉన్నత లక్ష్యాలుంటాయి. క్రమంలో కుటుంబ ఆర్థికాంశాలు ఇబ్బంది పెట్టే అవకాశం. మాట తీరువల్ల సమస్యలు. నైరాశ్య ధోరణి ఉంటుంది. నిల్వధనం కోల్పోయే సూచనలు. అన్ని పనుల్లోనూ కొంత జాగ్రత్తగా ఉండటం మేలు. వారం మధ్యమంలో సంప్రదింపులుంటాయి. సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. కొంత అసంతృప్తి ఉంటుంది. వ్యవహారాల్లో అనుకూలత. వారాంతంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలుంటాయి. అభీష్టసిద్ధి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో సమున్నత వ్యవహారాలుంటాయి. ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన. కార్యనిర్వహణలో అనుకూలత. కీర్తిప్రతిష్ఠలు. సృజనాత్మకత. సంతోషంగా గడుపుతారు. క్రమంగా వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమాధిక్యం. అనేక బాధ్యతల నిర్వహణ వల్ల శరీర మానసిక వత్తిడులు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా ఆశించిన తృప్తి ఉండదు. సామాజిక గుర్తింపు విషయంలో నిరాశగా ఉంటుంది. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. వారం మధ్యమంలో లాభాలపై దృష్టి పెరుగుతుంది. అనేక రూపాల్లో ప్రయోజనాలుంటాయి. కొత్త పనులను నిర్వహించే ప్రయత్నం. అన్ని కార్యక్రమాల్లోనూ అనుకూలత. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆలోచనల్లో కొంత వత్తిడి ఉంటుంది. సంతాన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744