S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వ్యక్తిత్వాలు

మనం వ్యక్తులం
వ్యక్తీకరించగల సామర్థ్యాన్ని
కల్గి వున్నవాళ్లం
మనకంటూ ఓ వ్యక్తిత్వాన్ని
రూపొందించుకున్న వాళ్లం
విలువలను ప్రమాణాలుగా చేసి
దానికో కొలమానాన్ని
నిర్దేశించుకొన్న వాళ్లం
గుర్తించి సమాజంలో
దానికో గౌరవాన్ని
ఆపాదించుకొన్న వాళ్లం
సామాజిక వేదికపై
మనల్ని మనం ఆవిష్కరించుకొనే
తులనాత్మక వైఖరులే
ఈ వ్యక్తిత్వాలు
వ్యక్తిత్వాలు ఎపుడూ
అభినందనీయాలు కావాలే గాని
అభిశంసనీయాలు కాకూడదు
ప్రశంసనీయాలు కావాలి గానీ
పరిహసనీయాలు కాకూడదు
ముంగిట ముగ్గుల్లా
అవి తీర్చినట్లుండాలి
చెక్కిన శిల్పంలా
మలచినట్లుండాలి
చెదరని కావ్యంలో
గుర్తుండిపోవాలి
అపుడు అవి
సామాజిక దేవాలయపు
సత్సంబంధాల నడుమ
గోపుర శిఖరాలే అవుతాయి.

- కె.రవీంద్రబాబు.. 90527 78988