S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎడతెగని ఎదురుచూపులు!

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే అంశంపై పార్టీలో తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు అనుసరించాల్సిన విధానంపై సీనియర్ నాయకులు, జూనియర్ నాయకుల మధ్య విభేదాలు తలెత్తడంతో పాటు పరిస్థితి వాగ్వివాదాలకు చేరుకున్నది. మొదట ఒక సీనియర్ నాయకుడిని తాత్కాలిక అధ్యక్షుడుగా ఎంపిక చేసుకుని సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ద్వారా కొత్త అధ్యక్షుడుని ఎన్నుకోవాలన్నది సీనియర్ నాయకుల వాదన. అయితే ఈ విధానాన్ని యువ నాయకులు, జూనియర్ నాయకులు, కొందరు ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ చేసిన రాజీనామా గురించి చర్చించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు లేదా ఎంపిక చేసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని యువ నాయకులు, పలువురు ఎంపీలు వాదిస్తున్నారు. కొందరు సీనియర్ నాయకులు తమలో తామే చర్చించుకుని కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు లేదా ఎంపిక చేసేందుకు ప్రయత్నించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదని వారు చెబుతున్నారు. అయితే సీనియర్ నాయకులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించటం లేదు. కొత్త అధ్యక్షుడి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటం వల్లనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని వారు చెబుతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ రాజీనామా గురించి చర్చించి ఆమోదించటం, ఆ తరువాత కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవటం చెబుతున్నంత తేలిక కాదని సీనియర్ నాయకులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించినట్లు ప్రకటించిన మరుక్షణం పార్టీలో సంక్షోభం నెలకొంటుందని పలువురు సీనియర్ నాయకులతో పాటు జూనియర్ నాయకులు సైతం తమ దారి చూసుకునే ప్రమాదం ఉన్నదని ఓక సీనియర్ నాయకుడు చెబుతున్నారు. గాంధీ కుటుంబం పార్టీకి దూరమైందనేది ధృవీకరించిన తరువాత కాంగ్రెస్‌ను కాపాడుకోవటం కష్టమన్నది వారి అభిప్రాయం. అయితే ఈ వాదనను యువ నాయుకలు, కొందరు ఎంపీలు ఆమోదించటం లేదు. రాహుల్ గాంధీ రాజీనామా చేయటం అనేది తిరస్కరించలేని నిజం, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులంతా సమావేశమై పార్టీ పరిస్థితిని సమీక్షించి అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వారు చెబుతున్నారు. రాహుల్ గాంధీ రాజీనామా చేసి నెలలు కావస్తున్నది, ఇక మీదట కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనంటూ రాహుల్ గాంధీ ప్రకటించి మూడు వారాలు కావస్తున్నా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోకపోతే కాంగ్రెస్‌ను కాపాడుకోవటం కష్టమని వారంటున్నారు. ధైర్యంగా ముందుకు సాగాలి, రాహుల్ గాంధీ స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకుని మహారాష్ట్ర, హర్యానా శాసన సభల ఎన్నికలకు సన్నద్దం కావలని వారు అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని నాన్చటం వలన ఇప్పటికే పార్టీ నీరుకారిపోతోంది, ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే అతి త్వరలో పార్టీ విచ్ఛిన్నం అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. రాహుల్ రాజీనామా మూలంగా ఇప్పటికే జిల్లాలు, మండలాల్లో కాంగ్రెస్ కనుమరుగైపోతోంది, అతి త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయి, చివరకు దేశ స్థాయిలో కాంగ్రెస్ మనుగడకు ప్రమాదం వస్తుందని యువ నాయుకలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ మూలంగా ఇప్పటికే కాంగ్రెస్‌కు తీరని నష్టం వాటిల్లింది. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో సీనియర్ నాయకులు మరింత జాప్యం చేస్తే కాంగ్రెస్‌ను కాపాడుకోవటం కష్టమని వారు హెచ్చరిస్తున్నారు.
ఇదిలాఉండగా, ఇరు పక్షాలను ఒక చోట సమావేశపరిచి సమస్యను పరిష్కరించేందుకు కొందరు నాయకులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని యువ నాయకుడికి అప్పగించాలా? లేక సీనియర్ నాయకుడికి అప్పగించాలా అనేది కూడా వివాదాస్పదంగా మారింది. అధ్యక్ష పదవికి సీనియర్ నాయకులు సుశీల్‌కుమార్ షిండే, ముకుల్ వాస్నిక్, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, మాజీ స్పీకర్ మీరా కుమార్ తదతరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒక దశలో సీనియర్ ముస్లిం నాయకుడిని అధ్యక్షుడుగా ఎన్నుకోవాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న ఈ సమయంలో ముస్లిం నాయకుడిని అధ్యక్షుడుగా ఎన్నుకోవటం ఎంత మాత్రం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో షెడ్యూలు కులాలకు చెందిన సీనియర్ నాయకుడిని అధ్యక్షుడుగా ఎన్నుకోవాలనే ప్రతిపాదనకు పలువురు సీనియర్ నాయకులు మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది.