S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అపర ఏకలవ్యుడు

విధివక్రించినా అతడు వెరవలేదు. ఆత్మస్థయిర్యాన్ని ఆణువయినా కోల్పోలేదు. సమాజంలో తానూ అందరిలాగే కష్టించి పని చేయాలని, ఏదో ఒకటి సాధించాలని, పట్టుదల కనబరిచాడు. విధివంచితుడననైనా, తన కుటుంబీకులకు తాను ఏనాటికీ భారం కావలదనుకొన్నాడు. తనకు భగవంతుడు ఒసంగిన జ్ఞానాన్ని ఫణంగా పెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించాడు. అహోరాత్రాలు శ్రమించాడు. ఆ పట్టుదల, ఆకాంక్ష, చిత్తశుద్ధితో కృషి, అకుంఠిత కార్యదీక్ష, అంకిత భావంతో అభ్యాసం, వెరసి తన అంగవైకల్యాన్ని అధిగమించాడు. పట్టుదల, ఆత్మస్థయిర్యం ఉంటే ప్రపంచంలో సాధించజాలనిది ఏదీ లేదని నిరూపించాడు. అనుకోని విపత్కర పరిస్థితులలో దైవం ఆగ్రహించి, అంగవికలత్వం కలుగగా, తన దైవానే్న నమ్ముకుని, ఉపాసించి, ప్రసన్నం చేసుకుని, అపర ఏకలవ్యునిగా దైవానుగ్రహంతో లక్ష్యసిద్ధిని పొందాడు. అంగవైకల్యం తీరని శాపమై, అతడి కదలికలు గృహానికే పరిమితం కాగా, అదివరకే మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకునియున్న అతడు, తన మేధస్సుకు పదునుపెట్టి, అనుభవాన్ని రంగరించి, మొక్కవోని ధైర్యంతో, జ్యోతిష శాస్త్రాన్ని అధ్యయనం చేసి, సనాతన పద్దతులకు, ఆధునిక పోకడలను జోడించి, లోతుగా పరిశోధించి, అద్భుత ఫలితాలను సాధించగలిగాడు సనాతన ఆర్షవిద్యలకు నిలయమైన ధర్మపురి నివాసి గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా తెలుగులో జ్యోతిషంకు సంబంధించిన వెబ్‌సైట్‌ను రూపొందించిన ఘనత ఉమ్మడి కరీంనగర్, ప్రస్తుత జగత్యాల జిల్లా ధర్మపురికి చెందిన గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మకు దక్కింది. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికి అందుబాటులో ఉండేలా ఎక్కువగా సేవలు కలిగి ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా తెలుగు-ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ ఉభయ తారకంగా డబ్బు చెల్లింపులతోనే గాక, ఉచితంగానూ ఎన్నో విలువైన సేవలు, సమాచారం అందించే విధంగా స్థానికులు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, బహుముఖ ప్రఙ్ఞశాలి సంతోష్ కుమార్ శర్మచే ఈ వెబ్‌సైట్ రూపొందించబడింది.
ఈ జ్యోతిష సేవలు వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా అందజేయబడుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర అమెరికా, యూరోప్, అగ్నేయాసియా దేశాలతో పాటు పాకిస్తాన్ లాంటి ముస్లిం దేశాల నుండి కూడా అత్యద్భుత స్పందన లభించడం వలన ఈ జ్యోతిష సేవల కొరకు ప్రత్యేకంగా తీతీతీ.్యశజశళీక్యఆజఒ్ద.ష్యౄ అనే వెబ్‌సైట్ ను రూపొందించి అధికశాతం సేవలు ఉచితంగా అందిస్తూ కొన్నింటిని ఆర్జిత సేవలుగా అందించడం జరుగుతున్నది. ఆర్జిత సేవల్లో జన్మకుండలి, ప్రశ్నాజ్యోతిషం, వధూవర గుణమేళనం, గోచారం, పరిహారక్రియలు, సంఖ్యాశాస్తమ్రు, నామశాస్తమ్రు, అదృష్ట రత్న సూచన మొదలైనవి అందజేయబడుతున్నవి.
ఇక ఉచిత సేవల్లో రాశిఫలాలు, లగ్నఫలాలు, సాయన రాశిఫలాలు, నక్షత్ర ఫలాలు, పంచాంగము, జన్మనక్షత్రం, జన్మలగ్నము, జన్మనామము, తారాబలం, చంద్రబలం, సూర్యరాశి/చైనారాశి, తెలుసుకోదగిన విషయాలు, ఉపయోగపడే లింకులు మొదలగు పేజీలను పొందుపరచడం జరిగింది. అన్నిహంగులతో నెలకొల్పబడిన, జ్యోతిషాలయం ద్వారా సంతోష్‌కుమార్ శర్మ సేవలందించడం గమనార్హం. ప్రజలకు అన్ని రకాల జ్యోతిష సేవలు ఏకగవాక్ష విధానంలో ఒకేచోట అందించడం ద్వారా ప్రజల మన్ననలను చూరగొనడం విశేషం.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494