గిన్నిస్ రికార్డుల పురిన్!
Published Saturday, 16 April 2016ఈ బంతిపై గిరగిరా తిరుగుతూ గిన్నిస్ రికార్డు కొట్టేసింది ఈ శునకం. జపాన్‌కు చెందిన మకటొ కుమగయ్కు చెందిన తొమ్మిదేళ్ల ఈ శునకం పేరు ‘పురిన్’. కదులుతున్న బంతిపై నడుస్తూ కేవలం 11.9 సెకండ్ల సమయంలో 10మీటర్ల దూరాన్ని అధిగమించి గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించింది. ఇంత తక్కువ సమయంలో మరే శునకం బంతిపై ఇలా ప్రయాణించలేదన్నమాట. అన్నట్లు ఇది పురిన్కు దక్కిన రెండో గిన్నిస్ రికార్డు. 2015లో కేవలం నిమిషం వ్యవధిలో 11 బంతులను తన ముందు రెండు కాళ్లతో పట్టుకుని ఓ గిన్నిస్‌రికార్డు కొట్టేసింది.