S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేటి సమాజం

నిత్యం తన కళ్లెదుట
జరిగిన జరుగుతున్న
నేరాలను ఘోరాలను
చూస్తూ చూడలేక
సిగ్గుతో తలవంచుకుంది
సమాజం

మానవుడు దానవుడిగా
మారుతూ చేస్తున్న
దారుణ మారణకాండకు
చేష్టలుడిగి చూస్తూ
తలదించుకుంది
నేటి సమాజం

ప్రేమలను బంధాలను
అనుబంధాలను నిలువునా
నరికి పారేస్తున్న
నరుడిని చూస్తూ
తలవంచుకుందీ సమాజం

వంచనలకు వాంఛలకు
కోరికకు కామానికి
బలైపోతున్న అబలలని
చూసీ చూడలేక
సిగ్గుపడుతూ
తలవంచుకుందీ సమాజం

-శ్రీష్టి శేషగిరి.. 9290652632