S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విజన్

ప్రిన్సిపాల్ కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, మేనేజ్‌మెంట్ లేక ప్రభుత్వం ప్రతినిధి అన్న విషయం మరచిపోకూడదు. ప్రభుత్వం నిర్ణయాలు కొన్నిసార్లు స్ట్ఫాకైనా, విద్యార్థులకైనా రుచించకపోవచ్చు. అలాంటి సమయంలో ప్రిన్సిపాల్‌కు విద్యార్థులకు మధ్యన టీచర్ లీడర్స్ ఉండాలి. వారు యుక్తవయసు కలవారు కాబట్టి, ప్రిన్సిపాల్ ధర్మాలు తెలిసినవారు కాబట్టి పాఠశాల వాతావరణం చెడిపోకుండా చూడాలి. టీచర్ లీడర్స్ అవసరం. ఉపాధ్యాయులలో నుంచి కొత్త నాయకులు పుట్టుకు రావాలి. విద్యార్థులలో సన్నిహిత సంబంధాలుంటాయి కాబట్టి ప్రిన్సిపాల్ బాధ్యతలను పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్యన మధ్యవర్తిత్వం వహించాలి. ఈ ఇరువురికి ప్రిన్సిపాల్ నచ్చజెప్పాలి. సర్ది చెప్పాలి. అలాంటి సమయంలోనే పాఠశాల కల్చర్‌ను కాపాడుకోవాలి. కొన్నిసార్లు ఉద్రిక్త వాతావరణంలో ఎవరూ కూడా రెచ్చిపోకుండా వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సామాజిక ప్రయోజనాలపైన దృష్టి పెట్టాలి. ఉపాధ్యాయ నాయకులు అనధికార కల్చరల్ గార్డియన్స్ (అనధికార సాంస్కృతిక రక్షకులు), ఉపాధ్యాయ నాయకులు దూరదృష్టితో పాఠశాల కల్చర్‌ను కాపాడాలి. కొన్నిసార్లు అటు ప్రిన్సిపాల్స్‌కు, విద్యార్థులకు మొహమాటం లేకుండా చెప్పవల్సి వస్తుంది. కొన్నిసార్లు ఉభయులు కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ, వాతావరణం సద్దుమణిగిన తర్వాత వారి పాత్రలను ఉభయులు కూడా ప్రశంసిస్తారు. స్కూలు కూడా ఒక మినీ సమాజం. సమాజంలో ప్రజా సంఘాలు ఏ పాత్ర వహిస్తాయో ఉపాధ్యాయ నాయకులు కూడా ఆ పాత్ర వహించాలి. స్కూల్‌కు ప్రిన్సిపాల్ ఎంత అవసరమో, టీచర్ లీడర్స్ కూడా అంతే అవసరం.
* * *
కొంతమంది ఉపాధ్యాయులు తమ పని తాము చేసుకుంటూ తరగతి గదిపై కొత్త పరిశోధనలు చేసుకుంటూ తోటి ఉపాధ్యాయులతో అభిప్రాయాలు పంచుకుంటారు. వారే తరగతికి, స్కూల్‌కి వనె్న తెచ్చేవారు. ప్రిన్సిపాల్ వారిని కలుసుకోవటానికై వారితో కొత్త భావాలు కనుక్కోవటానికై తానే టీచర్స్ స్ట్ఫా రూమ్‌కు వస్తాడు. దాని వలన ఆ మహనీయులు చేస్తున్నటువంటి కొత్త ప్రయోగాలను కనుక్కుంటాడు. ప్రిన్సిపాల్ కూడా వాటి నుంచి నేర్చుకుంటాడు. స్ట్ఫారూమ్ అంటే విశ్రాంతి తీసుకునే స్థలం కాదు. అంకితమైన ఉపాధ్యాయులు తరగతి గదిలో చేసిన ప్రయోగాలను తోటి ఉపాధ్యాయులతో చర్చించే స్థలమది. అలాంటి ఉపాధ్యాయులను ఎంతోమందిని చూశాను. వారు స్కూల్‌కు, విద్యారంగానికే అంకితమైనవారు. తమ పనే వారికి దైవం. ఏమీ ఆశించరు. అట్లాంటి వారిని కలుసుకునే అవకాశం కలిగింది. ఆ స్కూల్‌కు వారే నిజమైనటువంటి వెలుగులు. ఇలాంటి వారే కొత్త భావాలను ఉత్పత్తి చేస్తారు. విలువలను ప్రతిష్ఠిస్తారు. జలం దగ్గరకు మనిషి పోతాడు కానీ మనిషి దగ్గరకు జలం రాదు.
ప్రిన్సిపాల్ రూమ్‌లో తానే కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు వెళతారు. ఉపాధ్యాయుడే నిజమైన లీడర్.
* * *
ఎంతోమంది విద్యాధికులు తెలంగాణలో ఉన్న స్కూళ్లనుమాత్రం పవిత్రం చేశారు. ఖమ్మంలో అప్పట్లో ఒకే హైస్కూల్ ఉండేది. శేషాచారి సమర్థుడు. ఇంగ్లండ్‌లో చదువుకుని హెడ్‌మాస్టర్‌గా వచ్చాడు. ఆయన తరగతి గదిలోకి పోతే, నిశ్శబ్దంగా ఉండేవారు. ఇంగ్లీషు పాఠాలు చెప్పేవాడు. కానీ ఆయన ముందు అంతా తలవంచవలసిందే. శేషాచారి క్రమశిక్షణకు ప్రాధాన్యత నిచ్చేవాడు. తనకు ఎదురుగా ఎవ్వరినీ మాట్లాడనిచ్చేవాడు. ఎంత సమర్థత ఉన్నా తనకున్న ఈ వైఖరే అతనిని పాపులర్‌ను చేయలేకపోయింది. అందరూ తలవొంచి ఉండాలంటే పిల్లలు సహించరు. తన తోటి టీచర్స్ కూడా మనస్ఫూర్తిగా సహకరించరు. స్కూల్లో డిసిప్లినేర్‌గా శేషాచారి పేరు తెచ్చుకున్నాడు కానీ పాపులర్ హెడ్‌మాస్టర్‌గా పేరు తెచ్చుకోలేక పోయాడు. ముఖ్యంగా పిల్లలు సమర్థుడైన ప్రిన్సిపాల్‌ను హర్షిస్తారు కానీ తలవొంచి ఉండమంటే ఉండరు. కాబట్టి ప్రిన్సిపాల్‌కు పాపులర్ స్కిల్స్ కూడా అవసరం.
ఇతరుల అభిప్రాయాలను వినే ఓపిక కూడా ఉండాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ బాధలు చెప్పుకునేందుకు ఎంతో ఉద్రేకంతో వస్తారు. ప్రిన్సిపాల్ వారిని ఓదార్చినట్లు మాట్లాడితే ఎంతో సంతృప్తిగా వెళతారు. తను ప్రతిభావంతుడు కాబట్టి ఇతరులను నొప్పించకూడదు. తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన ఉపాధ్యాయులు సమస్యలు వింటే సంతృప్తితో వెళతారు.
సమర్థతే పనికి గీటురాయి కాదు, వచ్చిన వారి పట్ల ఆప్యాయత, ఓపికగా విషయాలు వినటం, వచ్చిన వారిని సంతృప్తి పరచటం చేసినప్పుడే మంచి ప్రిన్సిపాల్‌గా రాణిస్తారు. సమర్థులను గౌరవిస్తారు కానీ ఆ ఒక్క అంశంలోనే వారిని ఆదర్శ ప్రిన్సిపాల్‌గా పరిగణించలేరు. తాను చేసే పని ఇతరులను నొప్పించకుండా చేస్తేనే మంచి ప్రిన్సిపాల్‌గా రాణిస్తారు.

-చుక్కా రామయ్య