S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కానుక (సండేగీత)

జీవితంలో కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి.
అలాంటి పరిస్థితులని మనం ఊహించలేం.
మనం బాధలో వుంటాం. ఆ పరిస్థితిలో వున్నప్పుడు మరొకరి బాధని వినాల్సి వస్తుంది. మరొకరి బాధని పంచుకోవాల్సి వస్తుంది. ఇది ఎంతటి కష్టమైన పరిస్థితి.
మనం ఏదో కోల్పోయి దుఃఖిస్తుంటాం. మన కళ్లల్లో కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తుంటాయి. ఆ పరిస్థితిలో మనం మరొకరి కన్నీళ్లని తుడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎంతటి విచిత్రమైన పరిస్థితి.
మనల్ని ఎవరైనా కౌగిలించుకొని ఓదార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం దాన్ని కోరుకుంటూ ఉంటాం. ఆ పరిస్థితిలో మనం మరొకరిని కౌగిలించుకుని ఓదార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మనం చిరునవ్వు కోల్పోయిన పరిస్థితిలో వుంటాం. ఆ పరిస్థితిలో మరొకరికి చిరునవ్వుని ఇవ్వాల్సి వస్తుంది.
మనం జీవిత తుఫానులో చిక్కుకొని ఉంటాం. అలాంటి పరిస్థితిలో మరొకరికి దీవెనలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లోని ఏదో ఒక పరిస్థితి మనలో చాలామంది ఎదుర్కొం టూ ఉంటారు.
అప్పుడు ఈ సృష్టి మన పట్ల కఠినంగా ఉందని అన్పిస్తుంది. మన మీద ఎలాంటి ప్రేమని చూపించటం లేదని కూడా అన్పిస్తుంది.
ఈ పరిస్థితిని మనం ఓ కానుకగా స్వీకరించాలి.
ఓ అవకాశంగా స్వీకరించాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001